News March 17, 2025

నేడు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చేతన్ ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు ప్రజలు సమస్యలపై అర్జీలు తెలుపవచ్చని పేర్కొన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

Similar News

News November 10, 2025

MBBS ఫలితాల్లో కుప్పం PES టాప్

image

Dr.NTR హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన MBBS ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో కుప్పం PES మెడికల్ కళాశాల అగ్రస్థానంలో నిలిచింది. 150 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 143 మంది ఉత్తీర్ణత సాధించారని, 95.33% ఫలితాలతో ఏపీలో ప్రైవేట్ మెడికల్ కళాశాలలో PES అగ్రస్థానంలో నిలిచినట్లు CEO జవహర్ దొరస్వామి, ప్రిన్సిపల్ డా. హెచ్ఆర్ కృష్ణారావు తెలిపారు. డిస్టెన్షన్ లో 9 మంది, ఫస్ట్ క్లాస్ లో 82 మంది పాసైనట్లు వారు తెలిపారు.

News November 10, 2025

MNCL: రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

image

మంచిర్యాలలోని సైన్స్ కేంద్రంలో సోమవారం జిల్లా స్థాయి వ్యాస రచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. జిల్లాలోని 18 మండలాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. వ్యాసరచన పోటీలో అక్షర, ఉపన్యాస పోటీలో శ్రీవిద్య, క్విజ్ పోటీలో శివజ్యోతి, అఖిల్, కీర్తన, సుశాంత్, అక్షిత, టాలెంట్ టెస్ట్‌లో ఎండీ అతిఫా ప్రథమ బహుమతులు సాధించారు. ఇందులో అక్షర, శ్రీవిద్య, అతిఫా రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు.

News November 10, 2025

శ్రీరాంపూర్: స్ట్రక్చర్ సమావేశంలో పలు ఒప్పందాలు

image

గుర్తింపు ఏఐటీయూసీ సంఘం, సింగరేణి యాజమాన్యంకు Hydలో జరిగిన స్ట్రక్చర్ కమిటీలో పలు ఒప్పందాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. 150 మస్టర్ల ఆప్సెంటేజం సర్కులర్‌పై గత విధానాన్ని కొనసాగించడానికి అంగీకరించారు. బదిలీ వర్కర్లుగా అపాయింట్మెంట్ అవుతున్న ఉద్యోగులందరూ జనరల్ అసిస్టెంట్ ట్రేనీగా నియమించబడతారు. మెడికల్ బోర్డు, ప్రభుత్వ అనుమతి అనంతరం పెరిక్స్పై ఐటీ యాజమాన్యమే భరిస్తుంది.