News November 19, 2025

నేడు కాజీపేట నుంచి దర్భాంగా స్పెషల్ ట్రైన్

image

కాజీపేట మీదుగా దర్భాంగ స్పెషల్ రైలు బుధవారం నడవనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి-దర్భాంగ మధ్య నడిచే ఈ ప్రత్యేక రైలు(07999) కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్, కాగజ్‌నగర్, బల్లార్ష, గోండియా, రాయపూర్, బిలాస్‌పూర్, రాంచి సహా పలు స్టేషన్లలో ఆగనుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఈ రైలును నడుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Similar News

News November 23, 2025

గుంటూరులో నాన్ వెజ్ ధరలు ఇవే.!

image

గుంటూరులో నేటి నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ ధర కేజీ రూ.200, విత్ స్కిన్ రూ.180గా విక్రయిస్తున్నారు. మటన్ కేజీ ధర రూ.1050 పలుకుతోంది. ఇక చేపలు బొచ్చెలు, రాగండి ఇలా రకాలను బట్టి కేజీ రూ.200 నుంచి రూ.280 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు మీ ప్రాంతాల్లో నాన్ వెజ్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News November 23, 2025

నోబెల్ వచ్చినా దేశం దాటలేని పరిస్థితి

image

ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి విన్నర్ వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. డిసెంబర్‌ 10న నార్వేలో జరిగే నోబెల్ పురస్కారాల వేడుకకు హాజరైతే, ఆమెను పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని ఆ దేశ అటార్నీ జనరల్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినందుకు ఆమెకు నోబెల్ బహుమతి ప్రకటించినప్పటికీ, దేశం బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

News November 23, 2025

హైదరాబాద్ NGRIలో ఉద్యోగాలు

image

HYDలోని CSIR-NGRI 3 ప్రాజెక్ట్ అసోసియేట్, అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 27వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc, MSc, M.Tech (జియో ఫిజిక్స్, అప్లైడ్ జియోఫిజిక్స్, ఎర్త్ సైన్సెస్, మెరైన్ జియోఫిజిక్స్), MS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. NOV 28, DEC 3 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. https://www.ngri.res.in/