News February 9, 2025
నేడు కాళేశ్వరంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం

కాళేశ్వరంలో మహా కుంభాభిషేకం ఉత్సవాల్లో భాగంగా అత్యంత ముఖ్యమైన ఘట్టం ఆదివారం జరగనున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఆదివారం 10:42 గంటలకు మహా కుంభాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం తుని తపోవన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి నేతృత్వంలో నిర్వహిస్తారు. ఆదివారం సాయంత్రం ముగింపు కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
Similar News
News July 4, 2025
పార్టీ పదవులను క్యాజువల్‌గా తీసుకోవద్దు: రేవంత్

TG: రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం అని CM రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ‘కేంద్రం మెడలు వంచి జనగణనలో కులగణన చేసేలా చేశాం. ఎవరూ పార్టీ పదవులను క్యాజువల్‌గా తీసుకోవద్దు. వాటితోనే గుర్తింపు, గౌరవం లభిస్తాయి. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయి. కొత్త నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలి. కష్టపడి మళ్లీ INCని అధికారంలోకి తేవాలి’ అని TPCC కార్యవర్గ సమావేశంలో పేర్కొన్నారు.
News July 4, 2025
అల్లూరి ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి: కలెక్టర్

స్వరాజ్య సంగ్రామ చరిత్రలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశభక్తి, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం నంద్యాల కలెక్టరేట్లో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మన్యం వీరుడు అల్లూరి స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన మహనీయుడన్నారు. కార్యక్రమంలో జేసీ విష్ణు చరణ్ పాల్గొన్నారు.
News July 4, 2025
బంజారాహిల్స్‌లోని వరుణ్ మోటార్స్ సీజ్

బంజారాహిల్స్ రోడ్ నం.2లోని వరుణ్ మోటార్స్‌ను GHMC అధికారులు సీజ్ చేశారు. గత రెండేళ్లుగా ట్రేడ్ లైసెన్స్ లేకుండా వరుణ్ మోటార్స్ నిర్వహకులు వ్యాపారం చేస్తుండడంతో పలుమార్లు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో ఇవాళ సీజ్ చేశారు. గత మూడేళ్లుగా అడ్వర్‌టైజ్మెంట్ ఫీజులు బకాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.