News August 29, 2025
నేడు కుప్పం రానున్న సీఎం దంపతులు

సీఎం చంద్రబాబు 2 రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నేడు కుప్పం రానున్నారు. సాయంత్రం 6:30 గంటలకు హెలికాప్టర్లో బెంగళూరు నుంచి శాంతిపురం (M) తుమిసి వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకుంటారు. అనంతరం కడపల్లి సమీపంలోని సొంత ఇంటికి చేరుకొని రాత్రి 7:30 గంటల ప్రాంతంలో కడ అడ్వైజరీ కమిటీతో సమావేశం కానున్నారు. రేపు కుప్పంలో హంద్రీనీవా జనాలకు జలహారతితో పాటు బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు.
Similar News
News September 1, 2025
చిత్తూరు: సాయుధ దళాలకు వీడ్కోలు

ఏడు రాష్ట్రాలు దాటి మోటార్ సైకిల్ పై వెళ్తున్న సాయుధ దళాలకు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణంగా ఉందని అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. చిత్తూరులోని కాణిపాకం బైపాస్ రోడ్డులో సోమవారం ట్రై నేషన్, ట్రై సర్వీసెస్ లార్డ్ బుద్ధ మోటార్ సైకిల్ యాత్రను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఇలాంటి యాత్రలు యువతకు గొప్ప స్ఫూర్తి అని ఆయన చెప్పారు. యాత్ర చేస్తున్న వారికి ఘన వీడ్కోలు పలికారు.
News September 1, 2025
చిత్తూరు జిల్లాలో నేటి నుంచి రేషన్ పంపిణీ

జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి రేషన్ పంపిణీ చేయనున్నట్లు డీఎస్ఓ శంకరన్ తెలిపారు. మొత్తం 1,339 చౌక దుకాణాల పరిధిలోని 5.40 లక్షల కార్డుదారులకు బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పు అందించనున్నారన్నారు. ఇందుకుగాను జిల్లాకు 8 వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 3 వేల మెట్రిక్ టన్నుల చక్కెర వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
News September 1, 2025
రేపటి నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు వైద్య పరిక్షలు: ఎస్పీ

చిత్తూరు జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 2 నుంచి 7 వరకు వైద్య పరిక్షలు నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ ఆదివారం తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు నిర్దేశించిన తేదీల్లో ఉదయం 6 గంటలకు చిత్తూరు పాత జిల్లా పోలీసు కార్యాలయానికి హాజరుకావాలని సూచించారు. మహిళా అభ్యర్థులకు 2, 3న, పురుష అభ్యర్థులకు 4 నుంచి 7 వరకు పరిక్షలు నిర్వహిస్తారన్నారు.