News October 9, 2025

నేడు కృష్ణా వర్శిటీలో క్రీడల పండుగ

image

కృష్ణా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం క్రీడల పండుగ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ కుమారి ఓ ప్రకటనలో తెలిపారు. పురుషులకు, మహిళలకు వాలీబాల్, టేబుల్ టెన్నిస్, చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా శుక్రవారం సాంస్కృతిక కార్యక్రమాల పండుగ ఉంటుందన్నారు. సోలో, గ్రూప్‌ల వారీగా పాటలు, డ్యాన్స్ పోటీలు, స్కిట్స్, ఫ్లాష్ మాబ్ పోటీలు ఉంటాయని ఆమె తెలిపారు.

Similar News

News October 9, 2025

షాపుల యజమానులు అనుమతులు తీసుకోవాలి: ఎస్పీ

image

దీపావళి పండుగ పురస్కరించుకొని బాణసంచా తయారీ కేంద్రాలు, షాపులు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. గురువారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడారు. ప్రజల భద్రత, శ్రేయస్సులో భాగంగా పోలీస్ వారికి సహకరించాలన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా టపాసులు తయారు చేసినా, నిల్వ ఉంచిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు.

News October 9, 2025

విద్యార్థుల ఆరోగ్యం పట్ల దృష్టి సాధించండి: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో గురువారం సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

News October 9, 2025

పెట్రోల్ బంకుల్లో కనీస సౌకర్యాలు కరువు..?

image

కృష్ణా జిల్లాలో పుట్టగొడుగుల్లా పెరుగుతున్న పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు కనీస సౌకర్యాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో సుమారు 70 శాతం బంకుల్లో టాయిలెట్, తాగునీరు, గాలిమిషన్ వంటి ప్రాథమిక సౌకర్యాలు లేక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల గాలిమిషన్ పనిచేయడం లేదు, మరికొన్ని బంకుల్లో టాయిలెట్లు శుభ్రంగా లేవు. సిబ్బందికి కూడా కనీస విశ్రాంతి సౌకర్యాలు లేకపోవడం గమనార్హం.