News March 29, 2025

నేడు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి రాక

image

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటారు. అనంతరం రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇవ్వనున్న ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు. అదే విధంగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

Similar News

News April 1, 2025

విశాఖ మేయర్‌ పీఠంపై వీడనున్న ఉత్కంఠ..!

image

విశాఖ మేయర్‌ పీఠంపై మరికొద్ది రోజుల్లో సస్పెన్ష్ వీడనుంది. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కలెక్టర్‌ ఎం.హరేంద్ర ప్రసాద్‌కు కూటమి కార్పొరేటర్లు నోటీసులు ఇవ్వగా.. ఏప్రిల్ 19న అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ కార్పొరేటర్లకు సమాచారం అందించారు. అయితే YCPకార్పొరేటర్లను అధిష్ఠానం బెంగుళూరు తరలించగా.. కూటమి కూడా తమ కార్పొరేటర్లను టూర్‌కు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 

News April 1, 2025

ALERT: ఎండలు, పిడుగులతో వానలు

image

AP: రాష్ట్రంలో రేపు 26, ఎల్లుండి 28 మండలాల్లో <>వడగాలులు వీస్తాయని<<>> APSDMA వెల్లడించింది. చాలా చోట్ల 39-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు గురువారం రాయలసీమలో, శుక్రవారం ఉత్తరాంధ్రలో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని సూచించింది.

News April 1, 2025

రేపు వనపర్తి బార్ నూతన పాలకవర్గం పదవీ ప్రమాణం

image

వనపర్తి జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ పాలకవర్గం పదవీ ప్రమాణ స్వీకారం రేపు ఏప్రిల్ 1న సా. 7గంటలకు జరుగుతుందని నూతన అధ్యక్షుడు డి.కిరణ్ కుమార్ తెలిపారు. జిల్లా ప్రధాన జడ్జ్ ఎంఆర్ సునీత, జడ్జిలు రజిని, కవిత ,జానకి, రవికుమార్, తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్ నరసింహారెడ్డి, వైస్ ఛైర్మన్ సునీల్ గౌడ్,మెంబర్లు పాల్గొంటారని పేర్కొన్నారు.అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

error: Content is protected !!