News March 8, 2025
నేడు కొత్తగూడెం కోర్టులో లోక్ అదాలత్

ఈనెల 8వ తేదీన (శనివారం) కొత్తగూడెం కోర్టులో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి భానుమతి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. మీ మీద కానీ, మీకు తెలిసిన వారి మీద కానీ, మీ బంధువుల మీద కానీ ఎటువంటి కేసులు ఉన్నా రాజీ కుదుర్చుకోవడానికి మంచి అవకాశం ఉందని సూచించారు.
Similar News
News November 4, 2025
వచ్చేనెలలో పుస్తకాల పండుగ.. నగరం సిద్ధమా?

HYDలో బుక్ ఫెయిర్.. ఈ పేరు వింటే చాలు పుస్తక ప్రేమికులు పులకించిపోతారు. ఏటా నగరంలో జరిగే ఈ వేడుక కోసం ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది ఈ ఫెస్టివల్ వచ్చేనెలలో జరగబోతోంది. ఎన్టీఆర్ స్టేడియంలో DEC 19 నుంచి 10 రోజుల పాటు పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. కేవలం పుస్తక విక్రయాలే కాకుండా సాహితీ చర్చలు, పుస్తక ఆవిష్కరణలు ఉంటాయని బుక్ ఫెయిర్ అధ్యక్ష, కార్యదర్శులు యాకూబ్, శ్రీనివాస్ తెలిపారు.
News November 4, 2025
కార్తీక మాసం: దీపాలెందుకు పెడతారు?

శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ పవిత్ర కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉంది. కార్తీక మాసంలో ఇతర మాసాలతో పోల్చితే సూర్యకాంతి తక్కువగా ఉంటుంది. అందువల్ల దట్టమైన చీకటి కమ్ముకుంటుంది. త్వరగా సూర్యాస్తమయం అవుతుంది. ఆ చీకటి నిస్సత్తువకు కారణమవుతుంది. అందుకే ఆ చీకటిని పాలద్రోలడానికి, మనలో శక్తిని పెంపొందించుకోవడానికి కార్తీకంలో ప్రతి గుమ్మం ముందు, గుళ్లలో దీపాలు పెడతారు.
News November 4, 2025
న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్‌లో 405 పోస్టులు

హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్(<


