News December 29, 2025

నేడు క్యాబినెట్ భేటీ.. జిల్లాలపై నిర్ణయం?

image

AP: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ప్రధానంగా జిల్లాల పునర్విభజనపై సీఎం సమీక్షించనున్నారు. అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మార్పులపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 3 కొత్త జిల్లాల ఏర్పాటు, పలు రెవెన్యూ డివిజన్లకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Similar News

News December 29, 2025

వివక్షపై భారతీయుడి పోరాటం.. అహంకారానికి ₹81 లక్షల గుణపాఠం

image

బ్రిటన్‌లోని ఓ KFC అవుట్‌లెట్‌లో పనిచేసే తమిళనాడు యువకుడు మాధేశ్ రవిచంద్రన్ జాతి వివక్షపై కోర్టులో పోరాడి గెలిచాడు. కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం మాధేశ్‌ను శ్రీలంక తమిళుడైన తన మేనేజర్ ‘బానిస’ ‘భారతీయులంతా మోసగాళ్లు’ అని అవమానించేవాడు. తట్టుకోలేక మాధేశ్ ఉద్యోగానికి రాజీనామా చేసి కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం సుమారు ₹81 లక్షల పరిహారం చెల్లించాలని మేనేజర్‌ను ఆదేశించింది.

News December 29, 2025

ఐదేళ్లలోపు పిల్లలకు ఇవి పెట్టకూడదు

image

పిల్లలకు కొన్నిరకాల ఆహారపదార్థాలు పెట్టడం వల్ల ఆరోగ్య సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఏడాదిలోపు పిల్లలకు తేనె పెడితే బొట్యులిజం అనే వ్యాధి వస్తుంది. దీంతో చిన్నారుల్లో చూపు మందగించడం, అలసట, నీరసం వస్తాయి. అలాగే పాశ్చరైజేషన్‌ చేయని పాలు, జ్యూసులు, పెరుగులో ఈ.కొలి బ్యాక్టీరియా పెరిగి విరేచనాలు, బరువు తగ్గడం వంటివి జరుగుతాయి. అలాగే స్వీట్లు, ఉప్పు కూడా ఎక్కువగా ఇవ్వకూడదని సూచిస్తున్నారు.

News December 29, 2025

ప్రపంచంలో షార్టెస్ట్ ఫ్లైట్ రూట్.. 90 సెకన్లలో..

image

స్కాట్లాండ్‌లోని వెస్ట్రే-పాపా వెస్ట్రే దీవుల మధ్య ఓ చిన్న విమానం 2.7KM దూరాన్ని కేవలం 90 సెకన్ల నుంచి 2 ని.ల్లో చేరుకుంటుంది. అంటే సీట్ బెల్ట్ పెట్టుకునే సమయం కంటే తక్కువ టైమ్‌లోనే ల్యాండ్ అవుతుందన్న మాట. రోజూ 8-10 మందితో రాకపోకలు సాగిస్తోంది. విద్యార్థులు, టీచర్లు, డాక్టర్లు ఎక్కువగా వినియోగిస్తారు. బ్రిడ్జి కట్టేందుకు ఎక్కువ ఖర్చు, పడవల్లో ఎక్కువ సమయం వల్ల ఫ్లైట్ బెటర్ ఆప్షన్‌గా ఎంచుకున్నారు.