News January 2, 2025
నేడు ఖమ్మం జిల్లాలో పొంగులేటి పర్యటన
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారని క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పర్యటనలో భాగంగా పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం, సుజాతనగర్, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు గమనించాలని సూచించారు.
Similar News
News January 4, 2025
వామనావతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రాముడు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి శనివారం వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని బేడా మండపానికి మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల కోలాహలం నడుమ ఆలయం నుంచి మిథిలా స్టేడియానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
News January 4, 2025
ఖమ్మం: చింతకానిలో గుర్తు తెలియని మృతదేహం
ఖమ్మం జిల్లా చింతకాని నుంచి అనంతసాగర్ వెళ్లే మార్గ మధ్యలో ఉన్న మైసమ్మ గుడి సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. శుక్రవారం రాత్రి 7 గంటలకు వందేభారత్ రైలు కింద పడి ఆ వ్యక్తి మృతి చెందినట్టు స్థానికులు చెబుతున్నారు. వ్యక్తి నుజ్జు నుజ్జు కావడంతో గుర్తు పట్టడం కష్టంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 4, 2025
ఖమ్మం: ఆన్ లైన్ గేమ్స్‌తో ప్రాణాలు పోతున్నాయ్!
ఆన్‌లైన్ గేమ్స్ ప్రాణాలు తీస్తున్నాయి. ఈజీగా డబ్బు సంపాదించవచ్చనే ఆలోచనతో యువత ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలవుతున్నారు. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, నిరుద్యోగులు ఉంటున్నారు. కూసుమంచి మం. గైగోళ్ళపల్లికి చెందిన ఉపేందర్ ఆన్‌లైన్ గేమ్స్‌లో రూ.5 లక్షల వరకు పోగొట్టుకుని <<15051449>>బలవన్మరణానికి <<>>పాల్పడ్డాడు. ఆన్‌లైన్ గేమ్స్ ప్రమాదకరమని దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.