News February 16, 2025

నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

image

ఖమ్మం జిల్లాలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం పర్యటించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి కూసుమంచి, ఖమ్మం రూరల్, రఘునాథపాలెం, మధిర, ఖమ్మం, ముదిగొండ మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు గమనించి సకాలంలో హాజరుకావాలని సూచించారు.

Similar News

News July 9, 2025

బాల పురస్కార్ అవార్డుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

image

2025-26 ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి తెలిపారు. అసాధారణ ప్రతిభాపాటవాలు, ఆటలు, కళలు, సాహిత్యం, సామాజిక సేవ, ధైర్య సాహస కార్యక్రమాలు తదితర అంశాలలో అవార్డులను అందిస్తామని తెలిపారు. ఈ నెల 31లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. కాఫీలను కలెక్టరేట్‌ మహిళా శిశు సంక్షేమ శాఖలో అందించాలని తెలిపారు.

News July 9, 2025

ఖమ్మం జిల్లాలో తగ్గిన ఎంపీటీసీ స్థానాలు

image

ఖమ్మం జిల్లాలో MPTCల సంఖ్య తేలింది. గత ఎన్నికల్లో 289 స్థానాలుండగా ప్రస్తుతం 284కు తగ్గాయి. జిల్లాలో కల్లూరు, ఎదులాపురం మున్సిపాలిటీలుగా ఏర్పడటంతో సంఖ్య తగ్గింది. కల్లూరులో 5 స్థానాలు తగ్గటంతో 13 స్థానాలతో అధికారులు డ్రాప్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో కల్లూరులో 18 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. అటు ఎదులాపురంలోని గ్రామాలన్నీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రావటంతో పెద్దగా MPTCల సంఖ్య మారలేదు.

News July 9, 2025

ఖమ్మం జిల్లా లక్ష్యం 35,23,300 లక్షలు

image

వన మహోత్సవంలో భాగంగా ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో 35,23,300 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఖమ్మం అటవీ శాఖ తరఫున 2,47,200, సత్తుపల్లి డివిజన్‌లో 3లక్షలు, ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో 3,08,920, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో 2,41,740, కల్లూరులో 65వేలు, వైరాలో 50వేలు, ఏదులాపురంలో 40 వేల మొక్కలు నాటాల్సి ఉంటుంది. ఇంకా మిగతా శాఖలకు లక్ష్యాలను కేటాయించారు. మొక్కలు నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి.