News September 8, 2025
నేడు గండిపేటకు CM.. భారీ బందోబస్తు

నేడు గండిపేటలో CM రేవంత్ పర్యటిస్తారు. ఇప్పటికే కలెక్టర్ నారాయణరెడ్డి, MLA ప్రకాశ్ గౌడ్, జలమండలి MD అశోక్ రెడ్డి, రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ ఏర్పాట్లు పూర్తి చేశారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, 3కు శంకుస్థాపన, ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ 2ను CM ప్రారంభిస్తారు. అనంతరం CM బహిరంగ సభ ఉంటుందని MLA ప్రకాశ్ గౌడ్ తెలిపారు. CM రాకతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
Similar News
News September 8, 2025
వరంగల్: ఆయనే కారణం.. అందుకే చనిపోతున్న: మహిళా వీఆర్ఏ

వరంగల్ జిల్లా నల్లబెల్లి తహశీల్దార్ ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్ <<17649982>>ఆత్మహత్యకు యత్నించిన<<>> విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. MRO ఆఫీస్‌లో పనిచేసే మహిళా VRA వాంకుడోత్ కల్పన సోమవారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అంతకు ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్‌లో చరణ్ సింగ్ కారణమని పేర్కొంది. ఆమెను నర్సంపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
News September 8, 2025
HYD: రోడ్డున పడేయలేదనా? రోడ్డుపై వదిలేశారు!

నగరవ్యాప్తంగా గణపయ్య ప్రతిమలను రోడ్లపైనే విక్రయించారు. ఆ విగ్రహాలను అమ్మి సొమ్ముచేసుకుని మిగిలిపోయినవి ఇలా ఎర్రగడ్డలో రోడ్లపైనే వదిలేశారు. లాభాలు ఇచ్చినందుకా ఇలా ఆయన బొమ్మలను రోడ్డుపై వదిలేశారని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సనత్‌నగర్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. DCM వ్యాన్‌లో వాటిని తీసుకెళ్లి బేబీవాటర్ పాండ్, IDL చెరువులో నిమజ్జనం చేశారు. సతీశ్, సాయి ప్రకాశ్, రణ్‌వీర్, బవేశ్ కార్తీక్ ఉన్నారు.
News September 8, 2025
కుబీర్: ఆటో బోల్తా.. డ్రైవర్ మృతి

ఆటో బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లింగి గ్రామానికి చెందిన గంగాధర్ (33) భైంసా నుంటి ఆటోలో సిమెంటు బస్తాలను తీసుకువెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓల్డ్ సాంవ్లీ గ్రామం వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.