News September 23, 2025

నేడు గాయత్రీ దేవి అలంకారంలో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ

image

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ మంగళవారం గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనుందని ఆలయ పండితులు తెలిపారు. స్వర్ణ పంచముఖాలు, బంగారు అభయహస్తాలు, పచ్చల హారం, కంఠాభరణం, శంఖు చక్రాలు, బంగారు కిరీటంతో వేదమాత దర్శనమిస్తుందని చెప్పారు. దసరా నవరాత్రుల రెండో రోజు ఈ అలంకారం చేస్తారు. అమ్మవారిని శంఖం, చక్రం, గద, అంకుశం వంటి ఆయుధాలతో, మంత్రాలతో అలంకరిస్తారు.

Similar News

News September 23, 2025

కరీంనగర్: భూతల్లే వారికి డైనింగ్ టేబుల్..!

image

పొలం పనులకు వెళ్లిన మహిళా కూలీలకు పొలం పక్కన ఉన్న రోడ్డే డైనింగ్ టేబుల్ అయింది. ఉదయం నుంచి అలుపెరగకుండా శ్రమించిన వీరు.. మధ్యాహ్నం వేళ రోడ్డు పక్కనున్న చెట్టు కింద సేదతీరుతూ తెచ్చుకున్న సద్ది బువ్వను తిన్నారు. కష్టానికి అలసట తెలియదు, కన్నీళ్లకు బాధ ఉండదు అన్నట్లుగా తమ నిరాడంబరమైన జీవనశైలితో శ్రమజీవుల కష్టానికి నిలువుటద్దంలా నిలిచిన ఈ దృశ్యం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చునూర్లో కన్పించింది.

News September 23, 2025

డిగ్రీ కాలేజీల బంద్ కొనసాగుతుంది: ప్రైవేటు యాజమాన్యాల అసోసియేషన్

image

AP: ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించనందుకు నిరసనగా నిన్న రాష్ట్రవ్యాప్తంగా 70% కాలేజీలు మూసివేసినట్లు ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 27వరకు కాలేజీల బంద్ కొనసాగుతుందని ప్రకటించింది. OCT 6నుంచి విజయవాడలో నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని వెల్లడించింది. గత 16 నెలలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో కాలేజీల నిర్వహణ కష్టంగా మారిందని పేర్కొంది.

News September 23, 2025

స్థానిక ఎన్నికలకు సిద్ధం: మంత్రి లోకేశ్

image

AP: స్థానిక సంస్థల ఎన్నికలపై నిన్న మీడియా చిట్‌చాట్‌లో మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్స్‌కు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అయితే అందుకు వచ్చే ఏడాది మార్చి వరకు గడువుందని గుర్తు చేశారు. అటు నిర్ణీత గడువులోపు స్థానిక ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తిరుమల పరకామణిలో చోరీ కేసును సిట్‌తో దర్యాప్తు చేయిస్తామని లోకేశ్ తెలిపారు.