News November 10, 2024
నేడు గుంటూరుకి రానున్న డిప్యూటీ సీఎం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం గుంటూరుకు రానున్నారు. నగరంలోని అరణ్య భవన్లో ఉదయం 11 గంటలకు అటవీ అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొని అటవీ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు డిప్యూటీ సీఎం రాక కోసం ఏర్పాట్లు చేపట్టారు. తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ గుంటూరు నగరానికి రానున్నారు.
Similar News
News November 13, 2024
ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవద్దు: హైకోర్డు
వేమూరు మాజీ MLA మేరుగు నాగార్జున క్వాష్ పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో మేరుగుపై పద్మావతి అనే మహిళ అత్యాచారం కేసు పెట్టగా.. ఇటీవల కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే కేసును ఏం చేస్తారని హైకోర్టు పోలీసులను అడిగింది. రిటర్న్ రిపోర్టు ఇవ్వాలంటూ పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోద్దని, తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.
News November 12, 2024
బడ్జెట్లో ఉమ్మడి గుంటూరుకు అగ్రతాంబూలం
ఉమ్మడి గుంటూరు జిల్లాకు ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు కేటాయించింది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి..
➤ NG రంగా వర్సిటీకి రూ.507 కోట్లు
➤ AP CRDA సహాయనిధి కింద రూ.1053.70 కోట్లు
➤ ఉమ్మడి GNTలో యంత్ర పరికరాలకు రూ.11 కోట్లు
➤ అమరావతిలో మెట్రోరైలుకి రూ.50 కోట్లు
➤ కృష్ణా డెల్టాకు రూ.138 కోట్లు
➤ పులిచింతల నిర్వహణకు రూ.29.45 కోట్లు
➤ గుండ్లకమ్మకు రూ.13 కోట్లు
➤ GNT శంకర్ విలాస్ ROB విస్తరణకు రూ.115 కోట్లు
News November 11, 2024
గుంటూరు జిల్లాలో 14 నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్: కలెక్టర్
రాష్ట్ర బాలల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ఈనెల 14వ తేదీ నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభం కానుంది. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సోమవారం కలెక్టర్ నాగలక్ష్మి , జేసీ భార్గవ్ తేజ ఆవిష్కరించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వారి ఎదుగుదల లోపాలను గుర్తించేందుకు స్క్రీనింగ్ టెస్ట్ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.