News September 11, 2024
నేడు గుంటూరుకు జగన్ రాక

వైసీపీ అధినేత జగన్ బుధవారం గుంటూరులో పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 11 గంటలకు గుంటూరు సబ్ జైలుకు చేరుకుంటారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్‌తో ములాఖత్ అవుతారు. 11.30 గంటలకు జైలు నుంచి బయల్దేరి ఎస్వీఎన్ కాలనీలో టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ ఈదా సాంబిరెడ్డిని పరామర్శిస్తారు. 11.55కి ఎస్వీఎన్ కాలనీ నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.
Similar News
News November 4, 2025
గుంటూరు మిర్చీ యార్డులో 37,640 టిక్కీలు అమ్మకం

గుంటూరు మిర్చి యార్డుకు సోమవారం 40,415 మిర్చి టిక్కీలు విక్రయానికి వచ్చాయని మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక ఓ ప్రకటనలో తెలిపారు. ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 37,640 అమ్మకం జరిగినట్లు చెప్పారు. ఇంకా యార్డు ఆవరణలో 7,834 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. వివిధ రకాల మిరపకాయలకు ధరలు పలు రకాలుగా నమోదయ్యాయన్నారు.
News November 4, 2025
తెనాలి: ప్రభుత్వ పథకాల పేరుతో వృద్ధురాళ్లకు టోకరా

ప్రభుత్వ పథకం కింద తక్కువ ధరకు టీవీ, ఫ్రిడ్జ్ వంటి వస్తువులు ఇస్తామని, తీసుకోకుంటే పథకాలు ఆగిపోయాయని తెనాలి వీఎస్సార్ కళాశాల రోడ్డులో నివసించే 60 ఏళ్ల బొద్దులూరి సీతామహాలక్ష్మికి, గంగానమ్మపేటకు చెందిన లింగమల్లు ఆమనికి గుర్తు తెలియని వ్యక్తులు టోకరా వేశారు. ఒకరి వద్ద రూ.40 వేలు, మరొకరి వద్ద రూ. 30 వేలు తీసుకుని పత్తాలేకుండా పోయారు. మోసపోయామని గ్రహించిన ఇద్దరూ తెనాలి టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు.
News November 3, 2025
GNT: పత్తి రైతులకు కలెక్టర్ సూచన

రైతులు CM యాప్‌లో నమోదు కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రూపొందించిన పోస్టర్‌ను సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. సీసీఐ ద్వారా క్వింటాలుకు రూ.8110 మద్దతు ధర ఉందన్నారు. ప్రత్తి కొనుగోలుకు నోటిఫైడ్ చేసిన జిన్నింగ్ మిల్లులలో రైతులు విక్రయించవచ్చన్నారు. CM యాప్‌లో (CM APP) నమోదు చేసుకుని, జిన్నింగ్ మిల్లు, విక్రయ తేదీ ఎంపిక చేసుకోవచ్చని చెప్పారు.


