News January 7, 2026

నేడు గుంటూరులో మంత్రి అచ్చెన్నాయుడు ప‌ర్య‌ట‌న‌

image

రాష్ట్ర వ్య‌వ‌సాయశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు బుధవారం గుంటూరులో ప‌ర్య‌టించ‌నున్నారు. చుట్టుగుంట‌లోని వ్య‌వ‌సాయ శాఖ క‌మిష‌న‌ర్ కార్యాలయంలో మిర్చి వ్యాపారులు, క‌మీష‌న్ ఏజెంట్స్, అధికారుల‌తో మంత్రి స‌మావేశం అవుతారు. రాబోవు మిర్చి సీజ‌న్‌లో మిర్చి యార్డ్‌లో రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా, మిర్చి ధ‌ర‌లు ప‌త‌న‌మ‌వ్వకుండా అనుస‌రించాల్సిన విధివిధానాల‌పై మంత్రి చ‌ర్చించ‌నున్నారు.

Similar News

News January 9, 2026

గుంటూరులో MDMA మత్తు పదార్థాల పట్టివేత

image

గంజాయి, MDMA మత్తు పదార్థాలను కొత్తపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద మున్నా, చిల్లర ప్రేమ కుమార్ విక్రయదారుల నుంచి లిక్విడ్ గంజాయి, MDMA 3.12 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గుంటూరు నగరంలో మత్తు పదార్థాల విక్రయం, సేవనం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ హెచ్చరించారు. నిందితులకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిందన్నారు.

News January 9, 2026

పది విద్యార్థులు ఫ్లయింగ్ కలర్స్‌తో పాస్‌: గుంటూరు కలెక్టర్

image

పదో తరగతి విద్యార్థులు అందరూ ఫ్లయింగ్ కలర్స్‌తో పాస్ అవుతారని కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రోత్సహించారు. SC, ST, BC, మైనారిటీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల కోసం నిర్వహించిన విజయం మనదే కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. లక్ష్యాలను పెట్టుకుని వాటి విజయానికి కృషి చేయాలని సూచించారు. పరీక్షలపై భయం లేకుండా పాజిటివ్ మైండ్‌సెట్‌తో చదవాలని తెలిపారు. విద్యార్థులకు విజయం మనదే స్టడీ మెటీరియల్ ఇచ్చారు.

News January 9, 2026

తెనాలి: రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో జైలు శిక్ష

image

తెనాలి (M) నందివెలుగు వద్ద అక్రమంగా రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తూ పట్టుబడిన ఫిరంగిపురానికి చెందిన ఉయ్యాల తిరుపతయ్యకు 3 నెలలు జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి పవన్ కుమార్ తీర్పు ఇచ్చారు. 2022లో అప్పటి రూరల్ SI CH వెంకటేశ్వర్లు నిర్వహించిన తనిఖీల్లో నిందితుడు 60 బస్తాల PDS బియ్యంతో పట్టుబడగా, శుక్రవారం కేసు విచారణకు వచ్చింది. APP సునీల్ కుమార్ ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు.