News April 15, 2025

నేడు గుంటూరులో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం వెరిఫికేషన్  

image

గుంటూరు జిల్లా మున్సిపల్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ (హిందీ) పోస్టుల భర్తీకి సంబంధించి కీలక ప్రక్రియ మంగళవారం జరగనుంది. హైకోర్టు కామన్ ఉత్తర్వుల మేరకు అర్హులైన SGT, భాషా పండిట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉదయం 11 గంటలకు డీఈవో కార్యాలయంలో జరుగుతుందని డీఈవో రేణుక వెల్లడించారు. 10-10-2017 తేదీ కామన్ సీనియారిటీ జాబితాలో పేర్లున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.  

Similar News

News April 16, 2025

GNT: బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్ పొడిగింపు

image

ఫిరంగిపురం PSలో నమోదైన కేసులో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు నరసరావుపేట కోర్టు రిమాండ్‌ను ఈ నెల 28 వరకు పొడిగించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌లపై సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అనిల్‌ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అనిల్ రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది.

News April 16, 2025

గుంటూరు జిల్లాపై కందుకూరి వీరేశలింగం ప్రభావం

image

తెలుగు సామాజిక సంస్కర్త కందుకూరి వీరేశలింగం గుంటూరు జిల్లాపై గొప్ప ప్రభావం చూపారు. 1902లో ఉన్నవ దంపతులు గుంటూరులో నిర్వహించిన మొదటి వితంతు పునర్వివాహ వేడుకకు ఆయన హాజరయ్యారు. బాలికల విద్య, స్త్రీ సాధికారత కోసం పాఠశాలలు స్థాపించడంతోపాటు, బాల్య వివాహాలు, వరకట్నం వంటి సంప్రదాయాలను వ్యతిరేకించారు. ఆయన సంస్కరణలు నేటికీ ప్రాంతీయ సామాజిక వికాసానికి దోహదపడుతున్నాయి.

News April 16, 2025

మే 2న అమరావతికి ప్రధాని మోదీ రాక 

image

ప్రధాని నరేంద్ర మోదీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనుల్లో భాగంగా మోదీ పర్యటన మే 2వ తేదీన ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 3ఏళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రహదారులు పూర్తిచేస్తున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. 

error: Content is protected !!