News June 26, 2024

నేడు గుంటూరు కలెక్టర్‌గా నాగలక్ష్మి బాధ్యతల స్వీకరణ

image

గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా బుధవారం ఎస్.నాగలక్ష్మి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం మంగళవారం తెలిపారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు నూతన కలెక్టర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన బదిలీలలో గత కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని జీడీఎలో రిపోర్ట్ చేయాలని అధికారులు ఆదేశించిన విషయం విధితమే.

Similar News

News June 29, 2024

చంద్రబాబును కలిసిన TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా

image

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా శుక్రవారం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని ఉండవల్లిలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. పల్లా శ్రీనివాసరావు సమర్థ నాయకత్వంలో పార్టీ మరెన్నో విజయాలను సాధిస్తుందని, మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

News June 29, 2024

గుంటూరు: పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించిన ఎస్పీ

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ తుషార్ డూడి పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సిబ్బంది తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది తమ అనారోగ్య సమస్యలను వ్యక్తిగత సమస్యలను ఎస్పీకి వివరించగా సిబ్బంది సమస్యలను పరిగణలోకి తీసుకొని, వారికి సాధ్యమైనంత మేర సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

News June 28, 2024

పిన్నెల్లి అరెస్టుతో పల్నాడు ప్రశాంతంగా ఉంది: MLA భాష్యం

image

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుతో పల్నాడులో ప్రశాంత వాతావరణం ఏర్పడిందని పెదకూరపాడు శాసనసభ్యుడు భాష్యం ప్రవీణ్ చెప్పారు. శుక్రవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లలో దాడులు, దౌర్జన్యాలకు పల్నాడు జిల్లా కేరాఫ్‌గా మారిందన్నారు. చట్టం నుంచి నేరస్తులు తప్పించుకోలేరని పిన్నెల్లి విషయంలో రుజువైందన్నారు. 14 కేసులలో పిన్నెల్లి దోషిగా ఉన్నారన్నారు.