News December 14, 2025
నేడు జనగామ జిల్లాలో 79 గ్రామ పంచాయతీలకు పోలింగ్

జనగామ జిల్లా పరిధిలో నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 79 గ్రామ పంచాయతీలు, 710 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. జిల్లాలో 1,10,120 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జనగామ, నర్మేట, తరిగొప్పుల, బచ్చన్నపేట మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Similar News
News December 23, 2025
సిద్దిపేట: ‘ఓటర్ జాబితా సవరణ ఎంట్రీలు పూర్తి చేయండి’

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలు, ఓటరు మ్యాపింగ్ తదితర అంశాలపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
News December 23, 2025
నేడు కొవ్వూరులో ఆగనున్న 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లు

ఈనెల 23వ తేదీ నుంచి కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో విశాఖపట్నం-మచిలీపట్నం, విశాఖపట్నం కడప వెళ్ళే తిరుమల ఎక్స్‌ప్రెస్ ఆగనున్నాయి. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఎంపీ దగ్గుపాటి పురందరేశ్వరి కొవ్వూరు రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి రైళ్ళను ప్రారంభిస్తారని జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తెలిపారు.