News December 22, 2025
నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

AP: మంగళగిరిలో ఇవాళ జనసేన పార్టీ 3 వేలమందితో ‘పదవి-బాధ్యత’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. కూటమి ప్రభుత్వంలో జనసేన తరఫున నామినేటెడ్ పదవులు పొందినవారు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వారితో పార్టీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమై దిశానిర్దేశం చేస్తారని జనసేన వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Similar News
News December 27, 2025
న్యూఇయర్‌కి ఫ్యామిలీతో ఉంటారా.. జైల్లో ఉంటారా: సజ్జనార్

TG: జనవరి 1 వరకు స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ కొనసాగుతుందని హైదరాబాద్ CP సజ్జనార్ పేర్కొన్నారు. 2025 వార్షిక నేర నివేదిక విడుదల సందర్భంగా పౌరులను హెచ్చరించారు. ‘మద్యం తాగి పట్టుబడితే జైల్లో వేయటం ఖాయం. HYD మొత్తం ఇప్పటికే న్యూ ఇయర్ డ్రంకెన్ డ్రైవ్ నడుస్తోంది. ఈ ఏడాది నగరంలో నేరాలు 15% తగ్గాయి. పోక్సో కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. 368 కేసుల్లో రూ.6.45 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశాం’ అని తెలిపారు.
News December 27, 2025
జరీబు భూములపై పరిశీలనకు ఆదేశం

AP: రాజధాని ప్రాంతంలోని జరీబు(3 పంటలు పండేవి) భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల వర్గీకరణపై పున:పరిశీలనకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. జరీబు, నాన్ జరీబు భూములు ఇచ్చినవారికి ప్లాట్లు ఇస్తున్నామని, ఈ ప్రక్రియ 45రోజుల్లో పూర్తి చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
News December 27, 2025
పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌కు దీంతో చెక్

కొందరు మహిళలు డెలివరీ తర్వాత డిప్రెషన్‌కు లోనవుతుంటారు. దీనివల్ల తల్లీబిడ్డలిద్దరికీ ప్రమాదమే అంటున్నారు నిపుణులు. అయితే డెలివరీ తర్వాత డిప్రెషన్ రాకుండా తక్కువ మోతాదులో ఎస్కెటమైన్ ఇంజెక్షన్ ఇస్తే ఫలితం ఉంటుందంటున్నారు. డిప్రెషన్‌కు వాడే కెటమైన్ అనే మందు నుంచే ఎస్కెటమైన్‌ను తయారు చేస్తారు. పరిశోధనల్లో ఇది సుమారు 75% వరకూ డిప్రెషన్ లక్షణాలు రాకుండా చూసినట్లు పరిశోధకులు వెల్లడించారు.


