News January 14, 2026

నేడు జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన

image

ఉమ్మడి MBNR జిల్లాలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పర్యటించనున్నారు. ఎంపీ మల్లు రవితో కలిసి భూత్పూర్, దేవరకద్ర, కొత్తకోట పురపాలికల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మ.3 గంటలకు పెబ్బేరు మండలం తోమాలపల్లిలో వర్చువల్ విధానంలో విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Similar News

News February 21, 2026

నల్గొండలో 24న మినీ జాబ్ మేళా

image

నల్గొండలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 24న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎన్. పద్మ తెలిపారు. ఐటీఐ క్యాంపస్‌లోని ఉపాధి కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఈ మేళా ప్రారంభమవుతుందని తెలిపారు. ఇతర వివరాలకు 7893420435 నంబర్‌ను సంప్రదించాలని ఆమె కోరారు.

News February 21, 2026

సిరిసిల్ల: రోడ్డు ప్రమాదం.. బోల్తా కొట్టిన ఆటో

image

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్‌ హనుమాన్‌ ఆలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముస్తాబాద్‌ మండలం గూడూరుకు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆటోలో తంగళ్లపల్లి మైనారిటీ పాఠశాలకు వెళ్తుండగా వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థినీలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 21, 2026

చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు: కామారెడ్డి SP

image

కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులను లక్ష్యంగా చేసుకుని కారుతో అతివేగంగా దూసుకెళ్లిన నిందితుడు గిరెడ్డి మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పాత నేర చరిత్ర కలిగిన ఇతడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, విద్వేషాలకు తావులేకుండా మత సామరస్యాన్ని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.