News August 29, 2025
నేడు డీఎస్సీ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్: డీఈవో

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (డీఎస్సీ)కు అర్హత సాధించిన 230 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు జారీ అయ్యాయని విద్యాశాఖ అధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఈ నెల 29న ఏలూరులోని సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. కాల్ లెటర్‌తో పాటు, ఒరిజినల్, మూడు అటెస్టెడ్ జిరాక్స్ కాపీలను తీసుకురావాలని పేర్కొన్నారు.
Similar News
News August 29, 2025
జగదేవపూర్: డెంగ్యూ వ్యాధితో విద్యార్థి మృతి

జగదేవపూర్ మండలంలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలుడు యశ్వంత్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ గురువారం రాత్రి మరణించాడు. మండలంలో ఇది డెంగ్యూ కారణంగా సంభవించిన 3వ మరణం. పారిశుద్ధ్య లోపం వల్లే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోందని, అధికారులు వెంటనే దృష్టి సారించి నివారణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News August 29, 2025
రేపు ఖైరతాబాద్ గణపతి దర్శనానికి అమెరికన్ కాన్సులేట్

HYD ఖైరతాబాద్ గణనాథుని దర్శనం కోసం ఆగస్టు 30న HYD అమెరికన్ కాన్సులేట్ విలియమ్స్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణపతి వద్ద భద్రతను అధికారులు తనిఖీ చేశారు. ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ఖైరతాబాద్ గణపతి దర్శనం కోసం తాను ఎంతగానో వేచి చూస్తున్నట్లుగా విలియమ్స్ తెలిపారు.
News August 29, 2025
విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. శుక్రవారం కోస్టల్ బ్యాటరీ వద్దకు హెలిపాడ్‌లో చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ పుష్ప గుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సీఎం నోవాటెల్‌కు బయలుదేరి వెళ్లారు.