News June 26, 2024

నేడు తాడిపత్రి మున్సిపల్ అత్యవసర సమావేశం

image

తాడిపత్రి పురపాలక అత్యవసర సమావేశం నేడు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామ్ మోహన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఉంటుందని పట్టణంలోని అన్ని వార్డు కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది హాజరుకావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News June 29, 2024

SKU వీసీ హుస్సేన్ రెడ్డి రాజీనామా

image

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ హుస్సేన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్ర ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపారు. రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన హుస్సేన్ రెడ్డి ఈ ఏడాది జనవరి 17న ఎస్కేయూ వీసీగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

News June 29, 2024

అనంతపురం: వసతి గృహాలకు నిధులు మంజూరు

image

జిల్లాలో కొన్ని సాంఘిక సంక్షేమ గురుకుల వసతి గృహాలు, బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల వసతి గృహాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మరమ్మతుల నిమిత్తం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 15 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలకు రూ.1.35 కోట్ల నిధులు మంజూరు చేశారు.

News June 29, 2024

అనంతపురం జిల్లాకు వర్ష సూచన

image

ఉమ్మడి అనంతపురం జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. జులై 1, 2వ తేదీల్లో చిరుజల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకుల పెంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయ్ శంకర్ బాబు, నారాయణస్వామి తెలిపారు.