News September 11, 2025
నేడు తిరువూరుకు ‘కిష్కింధపురి’ మూవీ టీమ్

హీరో బెల్లంకొండ శ్రీనివాస్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘కిష్కింధపురి’ సినిమా యూనిట్ గురువారం తిరువూరులోని శ్రీ వాహిని కళాశాలలో సందడి చేయనుంది. ఈ నెల 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కోసం మూవీ టీమ్ మధ్యాహ్నం 3 గంటలకు తిరువూరు వస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
Similar News
News September 11, 2025
మదనపల్లిలో లంబాడీల గడీలు..!

సంచార గిరిజన వర్గంగా గుర్తింపు పొందిన లంబాడీలకు(బంజారా) గడీలు ఉన్నాయంటే నమ్ముతారా..!? తెలంగాణలో ఒకప్పుడు దొరల పాలనకు ప్రతీకగా ఉండే గడీలను పోలిన కట్టడాలు ములుగు(M) మదనపల్లిలో ఉన్నాయి. నిజాం కాలంలో ఇక్కడి లంబాడీలు భూస్వాములుగా ఉండేవారని, అప్పుడే విలాసవంతమైన భవంతులను నిర్మించుకున్నారని స్థానికులు చెబుతున్నారు. గడీలు శిథిలం కాగా వాటి ఆర్చీలు చెక్కు చెదరలేదు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ స్వగ్రామం ఇదే.
News September 11, 2025
మొక్కజొన్న: ఎరువుల యాజమాన్యం, తెగుళ్ల నివారణ

* పూత దశలో మొక్కజొన్న పంటకు 50KGల యూరియా, 20KGల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసి, నీటి తడిని ఇవ్వాలి.
* పేను బంక ఆశిస్తే డైమిథోయేట్ 30EC 2 ML లీటరు నీటికి, ఆకుమచ్చ, ఆకు మాడు తెగుళ్లు ఆశిస్తే 2.5గ్రా. మ్యాంకోజెబ్/1మి.లీ ప్రొపికొనజోల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
* కాండం కుళ్లు తెగులు కనిపిస్తే 100KGల వేప పిండి, 4KGల 35% క్లోరిన్ కలిగిన బ్లీచింగ్ పౌడర్‌ను కలిపి మొక్కల మొదళ్ల దగ్గర వేయాలి.
News September 11, 2025
15 ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా: లక్ష్మీశా

విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో ప్రత్యేక వైద్యులతో 24 గంటల పాటు వైద్య శిబిరం కొనసాగుతుందని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. ముందు జాగ్రత్తగా పైప్‌లైన్‌ల ద్వారా తాగునీటి సరఫరా నిలిపివేసి, 15 ట్యాంకర్‌ల ద్వారా నీటిని అందిస్తున్నామన్నారు. దీనిపై ఫిర్యాదుల కోసం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (9154970454) ఏర్పాటు చేశామని, రెవెన్యూ విభాగాలతో కూడిన ప్రత్యేక బృందాలు ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాయన్నారు.