News December 30, 2025
నేడు తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం

మకరవిళక్కు పండుగ కోసం శబరిమల అయ్యప్ప ఆలయం ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనుంది. పవిత్రమైన దీపాన్ని వెలిగించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు తెలిపింది. మకరవిళక్కు పూజల నేపథ్యంలో స్వామి దర్శనానికి లక్షల మంది తరలిరానున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. మండల పూజ తర్వాత శనివారం రాత్రి ఆలయాన్ని <<18690795>>మూసివేసిన<<>> విషయం తెలిసిందే.
Similar News
News December 30, 2025
ఇతిహాసాలు క్విజ్ – 112

ఈరోజు ప్రశ్న: జరాసంధుడికి ఆ పేరు ఎలా వచ్చింది?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 30, 2025
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

<
News December 30, 2025
బంగ్లాలో ఇండియన్స్ వర్క్ పర్మిట్ల రద్దుకు అల్టిమేటం

ఇంక్విలాబ్ మంచ్ నేత ఉస్మాన్ హాదీ హత్య తర్వాత బంగ్లాలో భారత వ్యతిరేక సెంటిమెంట్ పెరిగింది. తాజాగా ఇంక్విలాబ్ సంస్థ యూనస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. భారతీయులకు 24 గంటల్లోగా వర్క్ పర్మిట్లు రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అలాగే 24 రోజుల్లోగా హాదీ హత్యకు కారణమైన ప్రతిఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టాలని కోరింది. నిందితులు భారత్‌కు పారిపోయారని ఆరోపించిన కొన్ని గంటల్లోనే ఈ అల్టిమేటం వచ్చింది.


