News July 9, 2025

నేడు తెలంగాణ యూనివర్సిటీ‌లో జాబ్ మేళా

image

తెలంగాణ యూనివర్సిటీలో బుధవారం కెమిస్ట్రీ విభాగం, హెటిరో సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నేడు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు HOD సాయిలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ పరిధిలో కెమిస్ట్రీ విభాగంలో పీజీ విద్యనభ్యసించిన విద్యార్థులు జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అర్హులను ఎంపిక చేసి ధృవ పత్రాలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News July 9, 2025

వాడి వేడిగా ఉమ్మడి విశాఖ జడ్పీ సమావేశం

image

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఛైర్పర్సన్ జల్లేపల్లి సుభద్ర అధ్యక్షతన బుధవారం ప్రారంభమైంది. మూడు జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధుల పాల్గొన్న ఈ సమావేశం వాడావేడిగా సాగుతోంది. ఎమ్మెల్యేలు అడుగుతున్న ప్రశ్నలకు అధికారులు దాటవేస్తుండటంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలో రోడ్లు, సీజనల్ వ్యాధులు, పాఠశాలల్లో సదుపాయాలు తదితర అంశాలపై చర్చ జరుగుతోంది.

News July 9, 2025

ఆధార్ తొలి గుర్తింపు కాదు: భువనేశ్

image

బిహార్‌ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో నకిలీ ఓట్లను గుర్తించేందుకు ఆధార్‌ను అనుసంధానించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. కాగా ఆధార్ కేవలం ఒక ధ్రువీకరణ మాత్రమేనని, అర్హతకు ప్రాథమిక ఆధారం లేదా గుర్తింపు కాదని UIDAI CEO భువనేశ్ కుమార్ స్పష్టం చేశారు. అటు ఫేక్ ఆధార్ కార్డుల కట్టడికీ మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలిపారు. నకిలీ ఆధార్‌లను గుర్తించే QR కోడ్ స్కానర్ యాప్ అభివృద్ధి చివరి దశలో ఉందన్నారు.

News July 9, 2025

సామ్‌తో రాజ్.. శ్యామలి ఇంట్రెస్టింగ్ పోస్ట్

image

హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారనే పుకార్ల వేళ వీరిద్దరూ కలిసి ఉన్న <<17000941>>ఫొటో<<>> వైరలైన విషయం తెలిసిందే. ఈక్రమంలో రాజ్ సతీమణి శ్యామలి ఇన్‌స్టా స్టోరీలో ఆసక్తికర సందేశాన్ని పంచుకున్నారు. ‘ఏ మతమైనా మన చర్యలతో ఇతరులను బాధించొద్దని చెబుతుంది. అదే మనం పాటించాల్సిన గొప్ప నియమం’ అని రాసున్న కొటేషన్‌ను ఆమె పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది.