News April 5, 2026
నేడు దద్దరిల్లనున్న HYD

నేడు HYDలో ఐపీఎల్ సందడి నెలకొననుంది. ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో మన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తలపడనుంది. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో నగర క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భాగ్యనగర గడ్డపై ‘ఆరెంజ్ ఆర్మీ’ విజయకేతనం ఎగరవేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మ్యాచ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు, నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Similar News
News April 6, 2026
కడప జిల్లా సరిహద్దుల్లో మార్పులు

జిల్లాల పునర్వ్యవస్థీకరణతో సరిహద్దుల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 7 జిల్లాల సరిహద్దులు కలిగిన ఏకైక జిల్లాగా కడప జిల్లా నిలిచింది. అన్నమయ్య జిల్లా మార్పులతో రూపురేఖలు పూర్తిగా మారాయి. కొన్ని నియోజకవర్గాలను ఇతర జిల్లాల్లోకి విలీనం చేశారు. రైల్వే కోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలోకి చేరడంతో కొత్త సరిహద్దులు ఏర్పడ్డాయి. భౌగోళికంగా కడప జిల్లా కేంద్ర స్థానంలో ఉండటంతో ప్రాధాన్యం పెరిగింది.
News April 6, 2026
తమిళనాడు బోట్లను AP బార్డర్‌లోకి రానివ్వం: మంత్రి స్వామి

తమిళనాడు, కడలూరు, పాండిచ్చేరిలకు చెందిన సోనాబోట్లు ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చి ఇక్కడి మత్య సంపదను దోచుకెళ్తున్నాయని మంత్రి స్వామి అన్నారు. ఏపీ మత్య సంపద మనవారికే దక్కే విధంగా 4 హైస్పీడ్ బోట్లతో గస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు CM చంద్రబాబు నాయుడు తెలిపారన్నారు. తమిళనాడు బోట్లు ఏపీలోకి ప్రవేశించకుండా గస్తీ తిరిగేబోటులో ఉన్న పోలీసులకు తుపాకులు అందజేసే అవకాశం ఉందన్నారు.
News April 6, 2026
కాలు వాపుగా ఉందా? ప్రాణాపాయం కావచ్చు: రాజీవ్ కనకాల

కాలు వాపు, నొప్పి లేదా వేడి చేసినా నిర్లక్ష్యం చేయవద్దని నటుడు రాజీవ్ కనకాల సూచించారు. ఇది రక్త గడ్డలకు (DVT) సంకేతం కావచ్చని హెచ్చరించారు. ‘ఈ గడ్డలు ఊపిరితిత్తులకు చేరితే ప్రాణాపాయం కలగవచ్చు. ఎక్కువసేపు కూర్చోవడం, లాంగ్ ట్రావెల్ చేసేవారు మధ్యమధ్యలో నడవాలి. నీళ్లు బాగా తాగాలి. సకాలంలో గుర్తిస్తే ఈ సమస్యను పూర్తిగా నివారించి ప్రాణాలను కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు’అని ఆయన అవగాహన కల్పించారు.


