News April 5, 2026
నేడు దద్దరిల్లనున్న HYD

నేడు HYDలో ఐపీఎల్ సందడి నెలకొననుంది. ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో మన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తలపడనుంది. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో నగర క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భాగ్యనగర గడ్డపై ‘ఆరెంజ్ ఆర్మీ’ విజయకేతనం ఎగరవేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మ్యాచ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు, నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Similar News
News April 6, 2026
హైదరాబాద్‌లో నేడు అక్కడక్కడ చిరు జల్లులు

హైదరాబాద్‌లో ఇవాళ పాక్షిక మేఘావృతమైన వాతావరణం ఉండనుంది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 37℃, కనిష్ఠం 26℃ వరకు నమోదు కానుందని, వాయవ్య దిశ నుంచి గంటకు 4- 6 కి.మీల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
News April 6, 2026
HYD: సర్వ రోగాలకు మందు ఇక్కడే!

ప్రజలకు వ్యాధులు వస్తే అత్యాధునిక ఆస్పత్రుల్లో వైద్యం అందించేకంటే అవి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జిమ్ ఫీజు భరించలేక వీటికి దూరమవుతున్నారు. రోజూ 45 MIN వ్యాయామంతో షుగర్, BP రావని నిపుణల మాట. GHMCలోని వార్డుల్లో, శివారు గ్రామాల్లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి, పాడైనవి రిపేర్ చేయాలి. దీనికోసం కబ్జా అయిన పార్క్ స్థలాలను విడిపించి పార్క్‌గా, ఓపెన్ జిమ్‌గా మార్చితే సరి. మీరేమంటారు?
News April 6, 2026
ఇగ అంతా HYD 2.0 నయా స్టైల్!

నగర యువత టేస్ట్ ఇప్పుడు ‘HYD 2.0’ వైపు మళ్లింది. రెస్టోబార్ల నుంచి కేఫీల వరకు అంతా నాటు రుచులకు మోడ్రన్ టచ్ ఇస్తున్నారు. ఇక్కడ ‘మైండ్‌ఫుల్ ఇండల్జెన్స్’ ట్రెండ్ నడుస్తోంది. ఇష్టమైనవి తింటూ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం. అందుకే షుగర్ బదులు మాంక్ ఫ్రూట్, స్టివియా వాడుతున్నారు. మందు లేని కాక్‌టెయిల్స్, గట్-హెల్త్ పెంచే Matcha డ్రింక్స్‌తో పాటు ఇన్‌స్టా రీల్స్ కోసం సమ్మర్ కూలర్స్ ఇప్పుడు స్పెషల్ ఎట్రాక్షన్!


