News January 19, 2026

నేడు దావోస్‌కు CM రేవంత్

image

TG: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు నేడు సీఎం రేవంత్ దావోస్ వెళ్లనున్నారు. మేడారంలో మహాజాతరను ప్రారంభించాక ఉ.8 గం.కు హెలికాప్టర్‌లో HYD చేరుకుంటారు. ఉ.9.30గం.కు శంషాబాద్ నుంచి CM, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు పర్యటనకు వెళ్లనున్నారు. గూగుల్, సేల్స్‌ఫోర్స్, యూనిలివర్, లోరియల్, టాటా గ్రూప్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి సంస్థల అధినేతలతో రేవంత్ భేటీ అవుతారు.

Similar News

News February 11, 2026

వైసీపీ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది: పవన్

image

AP: వైసీపీ కుట్రలపై మూడు పార్టీలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం చంద్రబాబు అధ్యక్షతన NDA శాసనసభాపక్షం భేటీ అయింది. వైసీపీ విధ్వంస కుట్రలపై సభలో చర్చించాలని పవన్ పేర్కొన్నారు. ఆ పార్టీ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు.

News February 11, 2026

AIతో సెకన్లలో బ్రెయిన్ MRI రిపోర్ట్.. 97.5% కచ్చితత్వంతో!

image

మెదడు వ్యాధులను గుర్తించడంలో AI సంచలనం సృష్టిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ శాస్త్రవేత్తలు Prima అనే AI మోడల్‌ను అభివృద్ధి చేశారు. ఇది బ్రెయిన్ MRI స్కాన్‌లను సెకన్లలోనే విశ్లేషించి 97.5% కచ్చితత్వంతో ఫలితాలిస్తుంది. సుమారు 2.2లక్షల స్కాన్‌లతో ట్రైన్ అయిన ఈ మోడల్.. బ్రెయిన్ ట్యూమర్స్, స్ట్రోక్స్ వంటి 50కి పైగా సమస్యలను గుర్తించగలదు. వైద్య నిపుణులు లేని ప్రాంతాల్లో ఇది ప్రయోజనకరంగా మారనుంది.

News February 11, 2026

శాస్త్ర రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు

image

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, తగిన ప్రోత్సాహం అందించడం కోసం ఓ రోజు ఉండాలని యునెస్కో నిర్ణయించింది. ప్రఖ్యాత శాస్త్రవేత్త మేరీ క్యూరీ జయంతి అయిన ఫిబ్రవరి 11వ తేదీని ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ విమెన్‌ అండ్‌ గర్ల్స్‌ ఇన్‌ సైన్స్‌’గా నిర్వహించాలని 2015లో నిర్ణయించింది. సైన్స్‌&టెక్నాలజీ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.