News April 10, 2025
నేడు నంద్యాల జిల్లాకు వర్ష సూచన

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నేడు నంద్యాల జిల్లాలో వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు నిన్న నంద్యాల జిల్లా దొర్నిపాడులో అత్యధికంగా 39.7°C ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది.
Similar News
News December 27, 2025
కృష్ణా: మామ చేతిలో అల్లుడు దారుణ హత్య.!

తోట్లవల్లూరు మండలం పెనమకూరులో మామ చేతిలో అల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో మాటా మాటా పెరగడంతో మామ చీకుర్తి శ్రీనివాసరావు కర్రతో కొట్టగా అల్లుడు ఆదిమూలపు సురేశ్ (31) తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేశ్ మృతి చెందాడు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యతో విజయవాడలో నివసించేవాడు. ఇటీవల కుమార్తె మృతి నేపథ్యంలో వివాదం చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.
News December 27, 2025
సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలు పొందిన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువును జనవరి 5 వరకు పొడిగించినట్లు జిల్లా కోఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. అపరాధ రుసుము లేకుండా ఈ 5వ తేదీలోగా చెల్లించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ఇతర పూర్తి వివరాల కోసం తమ పరిధిలోని అధ్యయన కేంద్రాల నిర్వాహకులను సంప్రదించాలని సూచించారు.
News December 27, 2025
హనుమకొండ విద్యుత్ కార్యాలయంలో తప్పుదారి బోర్డు!

ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత పెంచేందుకే సమాచార హక్కు చట్టం-2005 అమల్లోకి వచ్చింది. కానీ HNK సర్కిల్ పరిధిలోని HNK రూరల్ డివిజన్ కార్యాలయంలో ఆర్టీఐ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. డీఈ కార్యాలయం ఎదుట పౌర సమాచారం బోర్డుపై ఇప్పటికే బదిలీ అయిన అధికారుల పేర్లే కొనసాగుతుండటం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కొత్త అధికారులు బాధ్యతలు చేపట్టి నెలలు గడుస్తున్నా బోర్డు మార్చకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం.


