News December 23, 2025
నేడు నరసింహుడి రూపంలో భద్రాద్రి రామయ్య

భద్రాద్రి క్షేత్రంలో వైకుంఠ అధ్యయనోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నాలుగో రోజైన మంగళవారం సీతారామచంద్రస్వామి వారు ‘నరసింహ’ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుడిని రక్షించిన స్వామివారి కథను అర్చకులు స్మరించారు. నరసింహ రూపంలో ఉన్న రామయ్యను దర్శించుకుంటే శత్రు భయాలు, గ్రహ దోషాలు తొలగుతాయని విశ్వసించే భక్తులు ఆలయానికి పోటెత్తారు.
Similar News
News December 31, 2025
నాకేమీ గుర్తు లేదు.. సిట్ విచారణలో ప్రశాంతిరెడ్డి!

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. TDP కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని నెల్లూరులోని ఆమె నివాసంలో సిట్ అధికారులు విచారించారు. YCP ప్రభుత్వంలో ఆమె TTD కొనుగోలు కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. కల్తీ గురించి ప్రశ్నించగా.. ‘4నెలలే ఆ పదవిలో ఉన్నా. ఐదేళ్ల కిందట జరిగినవి ఇప్పుడు గుర్తు రావడం లేదు’ అని ఆమె చెప్పినట్లు సమాచారం. చిన్న అప్పన్న తమ దగ్గర PAగా పనిచేయలేదని చెప్పారు.
News December 31, 2025
కరీంనగర్: గ్రామానికో మహిళా సంఘం భవనం..!

మహిళా స్వయం సహాయక సంఘాలు, గ్రామైక్య సంఘాల బలోపేతానికి గ్రామానికో భవనం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో ఉమ్మడి KNRలో 132 భవనాలు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ భవనాల నిర్మాణాలకు గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని పంచాయతీ రాజ్ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఉపాధి హామీ నిధులతో భవనాల నిర్మాణాలు చేపట్టనున్నారు. 2 గుంటల స్థలంలో 600 ఫీట్లతో రూ.10 లక్షలతో వీటిని కట్టనున్నారు.
News December 31, 2025
కృష్ణా: ముడా భూములకు రక్షణ ఏది.?

మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) పరిధిలో అక్రమ మట్టి తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు, అవినీతిని భరించలేక ఛైర్మన్ పదవికి మట్టా ప్రసాద్ రాజీనామా చేయగా, ప్రస్తుతం ఆ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. ప్రకృతి వనరుల దోపిడీ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం స్పందించి ‘ముడా’ భూములను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


