News December 28, 2025
నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో కేటీఆర్, కవిత పర్యటన

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆదివారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో సర్పంచులు, ఉపసర్పంచుల సమావేశంలో కేటీఆర్ పాల్గొనగా.. కల్వకుర్తి, అచ్చంపేటల్లో కవిత పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఒకే రోజు అన్నచెల్లెళ్లు జిల్లాకు వస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వీరి పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.
Similar News
News December 30, 2025
రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే మృతి

ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే గుంటి వెంకటేశ్వర ప్రసాద్ గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. ఇటీవల అనారోగ్యంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారని ఆయన కుటుంబీకులు తెలిపారు. 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. 2004లో కోడూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఆయన మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
News December 30, 2025
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో అప్రెంటిస్ పోస్టులు

CSIR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ 14 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. డిప్లొమా, గ్రాడ్యుయేట్ అర్హతల వారు జనవరి 8న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థులు ముందుగా అప్రెంటిస్ పోర్టల్ (NATS)లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డిప్లొమా అప్రెంటిస్‌లు 18-24ఏళ్ల మధ్య, డిగ్రీ అప్రెంటిస్‌లు 21 నుంచి 26ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://www.nio.res.in
News December 30, 2025
ప్రియాంకా గాంధీ కుమారుడితో ఎంగేజ్‌మెంట్.. ఎవరీ అవివా బేగ్?

ప్రియాంకా గాంధీ కుమారుడు రైహాన్ వాద్రాతో ఎంగేజ్‌మెంట్ వార్తలతో అవివా బేగ్ పేరు ఇప్పుడు SMలో మారుమోగుతోంది. ఢిల్లీకి చెందిన ఆమె ఒక ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్. జర్నలిజం చదివిన అవివా ‘అటెలియర్ 11’ అనే ఫొటోగ్రఫీ స్టూడియోను నడుపుతున్నారు. సామాన్య ప్రజల జీవనశైలిని తన కెమెరాలో బంధించడంలో ఆమెది ప్రత్యేక శైలి. పలు ఆర్ట్ గ్యాలరీల్లో ఫొటోలను ప్రదర్శించిన అవివా.. వెర్వ్ వంటి పాపులర్ మ్యాగజైన్లలో కూడా పనిచేశారు.


