News July 10, 2024
నేడు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం..!

నేడు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. నిజామాబాద్‌తో పాటు పక్కనే ఉన్న నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సరైనా వర్షాలు లేక జిల్లాలోని ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి.
Similar News
News February 12, 2026
నిజామాబాద్ జిల్లాలో క్యాంప్ రాజకీయాలు

నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వేళ క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. గెలిచిన అభ్యర్థులు చేజారకుండా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. బీజేపీ నుంచి ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే సూర్యనారాయణ, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ఆధ్వర్యంలో అభ్యర్థులను తరలించేందుకు ప్రైవేట్ బస్సులు సిద్ధం చేసినట్లు సమాచారం.
News February 12, 2026
NZB: నాలుగు కేంద్రాల్లో ఓట్ల కౌంటింగ్: సీపీ

నిజమాబాద్‌లో జరిగిన 2వ సాధారణ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం జరగనుంది. ఈ మేరకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు సీపీ సాయి చైతన్య గురువారం తెలిపారు. మొత్తం నాలుగు కౌంటింగ్ కేంద్రాల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్(బాలుర, నిజామాబాద్), విజయ మేరీ హైస్కూల్(బోధన్), ప్రభుత్వ డిగ్రీ కళాశాల(పిప్రి, ఆర్మూర్), ప్రభుత్వ జూనియర్ కళాశాల(భీమ్‌గల్)లో ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు వివరించారు.
News February 12, 2026
నందిపేట్: ఇద్దరి మృతి.. రెండు కుటుంబాల్లో విషాదం

నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరుశివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన శివ (28) బుధవారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఈనెల 2న నందిపేట్–కొండూరు మార్గంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో కొడుపల సాగర్ (30) చికిత్స పొందుతూ మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన శివ కూడా బుధవారం మృతి చెందాడు. ఒకే ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.


