News April 24, 2024

నేడు నిజామాబాద్ పార్లమెంట్‌కు 12 నామినేషన్లు

image

నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో సోమవారం 12 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు మళ్లీ ఒకటి, రెండు సెట్‌ల చొప్పున నామినేషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. కాగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటివరకు మొత్తం 28 నామినేషన్లు దాఖలు అయినట్లు వెల్లడించారు.

Similar News

News January 5, 2025

కామారెడ్డి: ద్వితీయ స్థానంలో నిలిచిన అనిల్

image

క్యాసంపల్లి ZPHS పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి అనిల్ తేజ్, ఇటీవల ఆదిలాబాద్‌లో జరిగిన ఎనిమిదవ ఇంటర్ డిస్ట్రిక్ట్ మౌంటెన్ సైక్లింగ్ పోటీల్లో ప్రతిభ చూపి ద్వితీయ స్థానం సాధించారు. ఈ విజయంతో అనిల్ తేజ్ సిల్వర్ మెడల్, ప్రశంసా పత్రం అందుకున్నారు. పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు నరసింహరావు, గణిత ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు తాడ్వాయి శ్రీనివాస్ అభినందించారు.

News January 5, 2025

ఎడపల్లి: యువకుడి పై కత్తులతో దాడి

image

ఎడపల్లి గ్రామానికి చెందిన ప్రణయ్ అనే యువకుడు తన ఇంటి వద్ద శుక్రవారం రాత్రి మిత్రులతో ముచ్చటిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్, నరేష్, కల్యాణ్‌, చంద్రకాంత్ అతని తమ్ముడు రవికాంత్‌ దుర్భషలాడుతూ.. ప్రణయ్ పై దాడికి పాల్పడ్డారు. దీంతో ప్రణయ్ మిత్రులు అక్కడి నుంచి పారిపోయారు. వారు ప్రణయ్ పై కత్తులతో దాడి చేసి గాయపర్చారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నామన్నారు.

News January 5, 2025

ఆర్మూర్: కోడి పందెల స్థావరంపై పోలీసుల దాడి

image

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శనివారం దూదేకుల కాలనీలో కోడి పందెలు నిర్వహిస్తున్న 13 మందిని పట్టుకున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వారి నుంచి కోడి కత్తులు, రూ.7,380 నగదు, 11 సెల్ ఫోన్లు, 4 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.