News December 22, 2025
నేడు నెక్లెస్ రోడ్డులో ‘మాక్ డ్రిల్’

ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేలా సోమవారం నెక్లెస్ రోడ్ వ్యూ ప్రాంతంలో ‘మాక్ ఎక్సర్సైజ్’ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ డీఆర్ఓ వెంకటాచారి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, హైడ్రా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. విపత్తు వేళ వివిధ శాఖలు సమన్వయంతో ఎలా స్పందించాలనే అంశంపై ఈ విన్యాసాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 24, 2025
‘ఐయామ్ సారీ అమ్మా’.. డిగ్రీ విద్యార్థిని సూసైడ్

TG: ఏడేళ్ల క్రితం తండ్రి మరణం, తాజాగా తల్లికి అనారోగ్యం.. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో ఖమ్మం(D) కవిరాజు నగర్‌లో విద్యార్థిని సృజన(18) సూసైడ్ చేసుకుంది. అనారోగ్యానికి గురైన అమ్మ బతకడం కష్టమని వైద్యులు చెప్పారు. భవిష్యత్తుపై బెంగతో మానసికంగా కుంగిపోయిన యువతి ‘ఐయామ్ సారీ అమ్మా’ అంటూ ఫొటోపై నోట్ రాసి నిన్న అఘాయిత్యానికి పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటన స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.
News December 24, 2025
జమ్మికుంటలో అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్ ట్రాక్

గ్రామీణ క్రీడాకారులను ఒలింపియన్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, జమ్మికుంటలో రూ.6.5 కోట్లతో అత్యాధునిక సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. తన చొరవతో ‘ఖేలో ఇండియా’ పథకం కింద ఈ నిధులు మంజూరయ్యాయని, ఉత్తర తెలంగాణ యువతకు ఇది వరం కానుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు.
News December 24, 2025
2028లోనే ప్రజలు కాంగ్రెస్‌ను బొంద పెడుతారు: KTR

TG: పనికిమాలిన <<18660605>>శపథాలు<<>> చేయడం, పత్తాలేకుండా పారిపోవడం రేవంత్‌కు అలవాటని BRS నేత కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘తిట్లు, బూతులతో డైవర్షన్ డ్రామాలు, తమాషాలు ప్రతిసారి పనిచేయవు. 2028లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం. మళ్లీ వందేండ్ల దాకా పుట్టగతులు లేకుండా పాతిపెట్టడం తథ్యం. మేము ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలం కాదు. రైతన్న హక్కులకు భంగం కలిగితే భగ్గున మండుతాం’ అని Xలో ఫైరయ్యారు.


