News September 26, 2024

నేడు నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం పర్యటన

image

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు రాపూర్ మండలం పెంచలకోన లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు సోమశిల ప్రాజెక్టు పవర్ హౌస్ పాయింట్ నుంచి ఉత్తర కాలువకు నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు.

Similar News

News March 11, 2025

నెల్లూరు: నేటి నుంచి శనగల కొనుగోలు రిజిస్ట్రేషన్లు

image

నెల్లూరు జిల్లాలోని శనగ పంటను ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించేందుకు నేటి నుంచి 20వ తేదీ వరకు రైతు సేవా కేంద్రాల్లో రైతులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జేసీ కార్తీక్  తెలిపారు. ప్రభుత్వం శనగను రూ.5,650 మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 11, 2025

నెల్లూరు: సరైన బిల్లులు లేని 4 కేజీల బంగారం స్వాధీనం

image

వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద జిల్లా విజిలెన్స్ ఎస్పీ రాజేంద్రకుమార్ ఆదేశాల మేరకు సీఐ కే.నరసింహారావు, DCTO కే. విష్ణు రావు తమ సిబ్బందితో వాహనాల తనిఖీలు చేపట్టారు. సరైన బిల్లులు లేకుండా కారులో తరలిస్తున్న రూ.3 కోట్ల 37 లక్షల విలువైన 4 కేజీల 189 గ్రాములు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం, కారును జీఎస్టీ అధికారులకు అప్పగించారు.

News March 11, 2025

నెల్లూరు: కలెక్టరేట్‌లో ఉచితంగా భోజనాలు

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలతో కలెక్టరేట్‌లో జరిగే PGRSకు ప్రజలు ప్రతి సోమవారం వస్తూ ఉంటారు. భోజన సమయం అయ్యేసరికి చేతిలో ఉండీ, లేక చాలామంది పస్తులు ఉంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన కలెక్టర్ ఆనంద్ అర్జీదారులకు ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేశారు. సమస్యలతో వచ్చే ప్రతి ఒక్కరూ కడుపునిండా భోజనం చేసేలా ఏర్పాట్లు చేసిన కలెక్టర్ ఆనంద్‌ను ప్రజలు అభినందిస్తున్నారు.

error: Content is protected !!