News October 8, 2025
నేడు పిన్నెల్లి సోదరుల విచారణ.. అరెస్టుపై ఉత్కంఠ

వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి సోదరులు నేడు విచారణకు హాజరుకావాలని మాచర్ల రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీరికి సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు నేటితో ముగియనుండటంతో, కేసు పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. విచారణ అనంతరం వారిని పోలీసులు అరెస్టు చేసే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Similar News
News April 5, 2026
ఖమ్మం: అధికారులకు ‘వెలుగుమట్ల’ సెగ..!

వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదం జిల్లా యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కోర్టు ఆదేశాలు, రాజకీయ ఒత్తిళ్ల మధ్య అధికారులు చిక్కుకుపోయారు. ఇటీవల కూల్చివేతల రోజే RDO బదిలీ కావడం, తాజాగా అర్బన్ MRO బదిలీతో వ్యవహారం ముదిరింది. బాధితులకు ఇళ్లు కట్టిస్తామని ప్రకటించినా, అర్హుల జాబితాలో అక్రమాలపై విమర్శలొస్తున్నాయి. ఒత్తిడి తట్టుకోలేక ఓ ఉన్నతాధికారి సైతం బదిలీ కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
News April 5, 2026
ప్రకాశం: జూన్‌లో పెట్టుబడిదారుల సదస్సు ఏర్పాటుకు ఆదేశం

ప్రకాశం జిల్లాలో పారిశ్రామికీకరణ వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. జూన్ నెలాఖరులో పెట్టుబడిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. దీనికోసం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ రాజాబాబు శనివారం ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరిశ్రమల స్థాపనకు జిల్లాలో అందుబాటులో ఉన్న భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
News April 5, 2026
గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠంపై కన్ను? వారసుల కోసం రాజకీయాలు!

WGL మేయర్ స్థానం జనరల్ కావడంతో ఆ సీటపై అన్ని రాజకీయ పార్టీలు కన్ను వేశాయి. వచ్చే మే 7న పాలకవర్గం పదవి కాలం ముగుస్తుంది. దీంతో గ్రేటర్ పరిధిలో ఉన్న MLAలు, మాజీ MLAలు, ఇతర ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలు మేయర్ సీటును తమ వారసులకు దక్కించుకోవడంపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఉన్న 66 వార్డుల్లో 34 వార్డుల్లో పట్టు సాధిస్తే మేయర్ కావొచ్చు. ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి.


