News February 2, 2025
నేడు పుంగనూరుకు రానున్న జనసేన అగ్రనాయకత్వం

సోమల ZP హైస్కూల్‌లో ఇవాళ ‘జనంలోకి జనసేన’ భారీ బహిరంగ సభ జరగనున్న విషయం తెలిసిందే. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుతోపాటూ పార్టీ అగ్రనాయకత్వం తరలిరానున్నారు. నాయకులు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. బహిరంగ సభలో నేతలు ఏం మాట్లాడుతారన్న చర్చ ఆసక్తిగా మారింది. టిడ్కో ఛైర్మన్ అజయ్, తిరుపతి MLA ఆరిని శ్రీనివాస్, ఉ.చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్‌లు హాజరుకానున్నారు.
Similar News
News November 5, 2025
తిరువన్నామలైలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరువన్నామలైకు బుధవారం వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశక్తి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు ఆలయ మర్యాదలతో సన్మానించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట వైసీపీ చిత్తూరు ఇన్‌ఛార్జ్ విజయానంద రెడ్డి ఉన్నారు.
News November 5, 2025
గిరిజనులకు కొత్త గ్యాస్ కనెక్షన్లు: చిత్తూరు కలెక్టర్

జిల్లాలోని 411 మంది గిరిజనులకు నూతన గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. దీపం-2 పథకంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ప్రతి గిరిజన కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీ కాలనీలలో ప్రతి ఇంటిని సందర్శించి అర్హతలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
News November 4, 2025
సోమల: ముళ్ల పొదలలో నవజాత శిశువు

అప్పుడే పుట్టిన నవజాత శిశువును ముళ్ల పోదలలో గుర్తు తెలియని వ్యక్తులు పడవేసిన ఘటన సోమల మండలంలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్ నడింపల్లి సమీపంలో శిశువును గుర్తించిన స్థానికులు సోమల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స ఇచ్చిన తరువాత ఐసీడీఎస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు చిన్నారిని అంబులెన్స్‌లో చిత్తూరు శిశు విహార్‌కు తరలించారు.


