News November 18, 2025
నేడు పుట్టపర్తికి గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం

గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ నేడు పుట్టపర్తికి రానున్నారు. సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు సా.6 గంటలకు వారు ప్రత్యేక విమానాల్లో పుట్టపర్తికి చేరుకుంటారు. రేపు ప్రధాని మోదీ రానుడంటంతో ఏర్పాట్లను పరిశీలించి రాత్రికి ఇక్కడే బస చేస్తారు. బుధవారం హిల్ వ్యూ స్టేడియంలో జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మోదీతో కలిసి పాల్గొంటారు.
Similar News
News November 18, 2025
HYD: మీ బండిలో ఇంజిన్ ఆయిల్ పోయిస్తున్నారా?

HYDలో నకిలీ ఇంజిన్ ఆయిల్ దందా రోజురోజుకూ పెరుగుతోంది. ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో కొందరి బండి ఇంజిన్ త్వరగా వేడెక్కుతోందని, పొగవస్తోందని ఆరా తీయగా గుట్టు బయటపడింది. ఈ ఆయిల్‌తో బండి త్వరగా బోర్‌కు వస్తుందని, క్లచ్‌లో తేడా గమనిస్తే మెకానిక్‌ను సంప్రదించాలని నిపుణుల చెబుతున్నారు. నమ్మకమైన చోట బండి సర్విసింగ్‌కు ఇవ్వాలని, ఆయిల్ కొనాలని సూచించారు. తేడావస్తే ఫిర్యాదు చేయొచ్చని పోలీసులు పేర్కొన్నారు.

రాజమండ్రి: ఒకేసారి రెండు పథకాల డబ్బులు..!

తూర్పు గోదావరి జిల్లాలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా 1,14,991 మంది లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు డీఏఓ ఎస్.మాధవరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అన్నదాత సుఖీభవ కింద రూ. 57.50 కోట్లు (ఒక్కో రైతుకు రూ. 5000), పీఎం కిసాన్ కింద రూ. 19.50 కోట్లు (ఒక్కో రైతుకు రూ. 2000) మంజూరయ్యాయి. మొత్తం రూ. 77 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.