News February 2, 2025
నేడు ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవం

1970 ఫిబ్రవరి 2న నెల్లూరు, KNL, GNT జిల్లాల్లోని కొంత భాగాలతో ప్రకాశం జిల్లా ఆవిర్భవించింది. 1972లో టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్థం నామకరణం చేయబడింది. ప్రకాశం జిల్లా అనగానే గుర్తుకు వచ్చేవి ఒంగోలు జాతి గిత్తలు. వరి, సజ్జలు, రాగులు, జొన్నలు, చెరకు, వేరుసెనగ, ప్రత్తి, పొగాకు ప్రధానపంటలు. మార్కాపురం పలకలకు, చీమకుర్తి గ్రానైట్ గనులకు ప్రసిద్ధి. మన జిల్లాలో మీకు నచ్చేది ఏంటో కామెంట్ చేయండి.
Similar News
News December 20, 2025
ప్రకాశం: పెన్షన్‌దారులకు కీలక సూచన.!

ప్రకాశం జిల్లాలోని ఆయా సబ్ ట్రెజరీల పరిధిలో సర్వీస్ పింఛన్ పొందే పెన్షన్‌దారులకు జిల్లా ఖజానా అధికారి జగన్నాధరావు శుక్రవారం కీలక సూచన చేశారు. పెన్షన్‌దారులు లైఫ్ సర్టిఫికెట్, నాన్ ఎంప్లాయిమెంట్ సర్టిఫికెట్‌తోపాటు అదనంగా నాన్ రీ మ్యారేజ్ సర్టిఫికెట్లను 2026 జనవరి 1 నుంచి, ఫిబ్రవరి 28వ తేదీలోగా సమర్పించాలని ఆయన సూచించారు. అలాగే ఏవీసీ ఫారాలను పోస్టాఫీస్, మీసేవ కేంద్రాల ద్వారా సమర్పించవచ్చన్నారు.
News December 20, 2025
Y.పాలెం: ‘అన్ని అంశాలపై శ్రద్ధ చూపాలి’

ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం మండలంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు కేంద్ర ప్రభారి అధికారి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో ఆయన జిల్లా అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్రం నిర్దేశించిన 39 అంశాల్లో కొన్ని అంశాలలో 100% లక్ష్యాలను సాధించారని, మిగిలిన అంశాలపై కూడా శ్రద్ధ చూపాలని సూచించారు.