News November 24, 2025
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తమ సమస్యలు పరిష్కారం కానివారు కాల్ సెంటర్ 1100ను సంప్రదించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News February 22, 2026
కంబదూరు మండలంలో విషాదం

కంబదూరు మండలం మర్రిమాకుల పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఎద్దుల బండి బోల్తా పడటంతో గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు(57) మృతి చెందారు. ఈయన ఎద్దుల బండిని తోలుకుంటూ పొలానికి బయలుదేరారు. మార్గమధ్యంలో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో రామాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News February 19, 2026
మంత్రి లోకేశ్‌తో పరిటాల కుటుంబ సభ్యులు

మంత్రి లోకేశ్ ఏర్పాటు చేసిన ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నేతల విందులో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ దంపతులు పాల్గొన్నారు. విందు స్వీకరించి నియోజకవర్గ సమస్యలను మంత్రికి వివరించారు. అనంతరం పరిటాల సునీత, శ్రీరామ్ సతీమణి జ్ఞానకు నారా లోకేశ్ పట్టు చీరలు అందజేశారు.
News February 19, 2026
‘మార్చి 31లోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి’

అనంతపురం జిల్లాలో వివిధ ఇంజినీరింగ్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆర్అండ్‌బీ, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, సమగ్ర శిక్ష అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్‌హెచ్‌ఎం స్కీం పనులు సకాలంలో పూర్తి చేయకపోతే నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నాణ్యతతో పనులను గడువులోగా ముగించాలని అధికారులకు సూచించారు.


