News December 23, 2024
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: అన్నమయ్య కలెక్టర్
రాయచోటి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా సోమవారం ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమానికి రావాలని, వచ్చే ప్రజల సమస్యలను అర్జీల రూపంలో తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News December 22, 2024
ఓబులవారిపల్లి: బైక్‌ను ఢీకొన్న ఆటో.. భార్యా భర్తలు మృతి
ఓబులవారిపల్లి మండలం రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రాజంపేట వెళ్తున్న బైకును, రాజంపేట నుంచి వస్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో <<14954233>>నరసింహ(40), భార్య సుజాత (35) అక్కడికక్కడే మృతి చెందారు. <<>>కుమారుడు, కుమార్తెలు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. రాజంపేట భువనగిరి పల్లెకు చెందిన నరసింహ వై.కోటలో అత్తగారింటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
News December 22, 2024
శివాలయ అభివృద్ధికి కృషి చేస్తా: MLA మాధవి
కడప నగరంలోని మృత్యుంజయ కుంట శివాలయ అభివృద్ధికి కృషి చేస్తానని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టం చేశారు. శివాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, దేవాదాయశాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే మాధవిరెడ్డి పరిశీలించారు. తమ హయాంలో ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
News December 22, 2024
కొండాపురం : గండికోట ముంపు వాసులకు అండగా ఉంటాం
గండికోట జలాశయాన్ని ఆదివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్యాగ సీనులైనా గండికోట ముంపు వాసులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఉన్నారు. MLA ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్‌ఛార్జ్ భూపేశ్ రెడ్డి, ఉన్నతాధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.