News August 28, 2025
నేడు బాపట్ల జిల్లాకు భారీ వర్ష సూచన.!

ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని APSDMA బుధవారం ‘X’ వేదికగా వెల్లడించింది. దీని ప్రభావంతో గురువారం బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు లేదా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40-60 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News August 28, 2025
NZB: భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థల బంద్

భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు విధిగా సెలవు పాటించాలని సూచించారు. వర్షాల వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టమన్నారు.
News August 28, 2025
NLG: వినాయకుడి చుట్టూ స్థానిక రాజకీయం

గ్రామాల్లో పొలిటికల్ హీట్ మొదలైంది. ఓవైపు జిల్లాలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తుండడంతో ప్రధాన పార్టీలకు చెందిన లీడర్లు గ్రామాల్లో ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. వినాయక చవితి వేడుకలు తమకు కలిసి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో గణేష్ మండపాల వద్ద లోకల్ లీడర్లు ఫోటోలతో ఫ్లెక్సీలు, హోర్డింగులు దర్శనమిస్తున్నాయి.
News August 28, 2025
సరిహద్దుల్లో కాల్పులు.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

జమ్మూ కశ్మీర్‌లోని గురెజ్ సెక్టార్‌లో LoC గుండా చొరబాటుకు యత్నించిన ఇద్దరు టెర్రరిస్టులను ఆర్మీ మట్టుబెట్టింది. కొంతమంది ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశిస్తున్నారని తెలుసుకున్న సైన్యం వెంటనే అప్రమత్తమైంది. J&K పోలీసులతో కలిసి ‘నౌషేరా నార్-4’ పేరిట జాయింట్ ఆపరేషన్ చేపట్టి ఇద్దరిని ఎన్‌కౌంటర్ చేసింది. మిగిలిన వారి కోసం పరిసర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు ఆర్మీ ట్వీట్ చేసింది.