News July 20, 2024

నేడు బిక్కనూర్ మండలానికి మంత్రి జూపల్లి

image

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు బిక్కనూర్ మండలంలో పర్యటించనున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి చెప్పారు. మండల కేంద్రంలో నిర్వహించే రైతు సంబరాలలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి ఆయన పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నట్లు, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు.

Similar News

News August 18, 2025

NZB: రుణమాఫీ, రైతు భరోసా, రైతుభీమా నిధులు ఎన్నంటే?

image

నిజామాబాద్ జిల్లాలో రైతు సంక్షేమ పథకాలు ఊపందుకున్నాయి. రైతు రుణమాఫీ కింద 97,696 మంది రైతుల పంట రుణాలు రూ.755.29 కోట్లు మాఫీ అయ్యాయి. ‘ఇందిరమ్మ రైతు భరోసా’ కింద 2,72,589 మంది రైతుల ఖాతాల్లో రూ.316 కోట్లు జమ చేశారు. రైతు బీమా ద్వారా 966 మంది రైతుల కుటుంబాలకు రూ.48.30 కోట్లు అందాయి. ఇలా మొత్తం మీద రైతులకు రూ.1,119 కోట్లకు పైగా ప్రయోజనం లభించింది.

News August 18, 2025

NZB జిల్లాలో ఎన్ని ఎకరాల పంట సాగు చేస్తున్నారో తెలుసా?

image

నిజామాబాద్ జిల్లాలో వానాకాలం-2025 సీజన్‌లో రైతులు 5.33 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో వరి 4.19 లక్షలు, మొక్కజొన్న 52 వేలు, సోయా చిక్కుడు 33 వేలు, పసుపు 23 వేల ఎకరాలు ఉన్నాయి. దీనికోసం ఇప్పటివరకు యూరియా 59,236, డీఏపీ 11,385 మెట్రిక్ టన్నులు వాడారు. అత్యవసర పరిస్థితుల కోసం 1,746 మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్‌లో ఉంచారు.

News August 18, 2025

స్త్రీనిధి రుణాల మంజూరులో నిజామాబాద్ టాప్

image

స్త్రీనిధి రుణాల మంజూరు, రికవరీలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2024-25లో 2,953 మహిళా సంఘాలలోని 7,386 మంది సభ్యులకు రూ. 63.11 కోట్లు రుణాలు మంజూరు చేశారు. 2025-26లో రూ. 1,228.50 కోట్లు లక్ష్యం కాగా, ఆగస్టు 11 నాటికి 4,300 సంఘాలకు రూ. 357.41 కోట్లు ఖర్చు చేశారు. ఈ పనితీరు జిల్లాలో మహిళా సాధికారతకు నిదర్శనం.