News August 24, 2024

నేడు బెంగళూరు – హౌరా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రీ షెడ్యూల్

image

SMV బెంగళూరు నుంచి రేణిగుంట, విజయవాడ మీదుగా నడుస్తున్న SMV బెంగళూరు – హౌరా ఎక్స్‌ప్రెస్ (12864) శనివారం 10:35 గంటలకు బయలుదేరడానికి బదులుగా 14:00 గంటలకు బయలుదేరనుంది. విశాఖకు రేపు ఉదయం 8:00 గంటలకు చేరుకోవచ్చు కావున ప్రయాణికులు ఈ మార్పును గమనించగలరని రైల్వే అధికారులు కోరారు.

Similar News

News September 22, 2025

విశాఖలో పిడుగు పడి ఉద్యోగి మృతి

image

విశాఖలో సోమవారం విషాదం నెలకొంది. మధురవాడ సమీపంలో కొమ్మాది గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియం వద్ద పనిచేస్తుండగా పిడుగు పడి జీవీఎంసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ప్రకాష్(37) మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలానికి పీఎం పాలెం పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

News September 22, 2025

సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో తగ్గనున్న ధరలు

image

సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో నేటి నుంచి నూతన జి.ఎస్.టి అమలు చేయనున్నట్లు సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ తెలిపారు. రూ.1000 నుంచి రూ.2500 విలువ గల వస్త్రాలపై 12%గా ఉన్న జి.ఎస్.టి 5%గా అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ నూతన జి.ఎస్.టి విధానం అమలుతో 6.25% వినియోగదారులకు లాభం చేకూరుతుందన్నారు.. వినియోగదారులు గమనించాలన్నారు.

News September 22, 2025

విశాఖ పోలీసులకు ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు

image

విశాఖ పోలీసులకు అరుదైన గౌరవం దక్కింది. రోడ్డు ప్రమాద బాధితులకు విశాఖ సీపీ ఏర్పాటు చేసిన తక్షణ సహాయ కేంద్రంకు స్కోచ్ అవార్డు లభించింది.ఈ అవార్డును సెప్టెంబర్ 20న విశాఖ పోలీసులకు ప్రధానం చేసినట్లు విశాఖ సిపి శంక బ్రత బాగ్చి ఆదివారం ప్రకటనలో విడుదల చేశారు. భారతదేశమైన మొట్టమొదటిసారిగా రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం అందించడం పట్ల అవార్డు దక్కిందని పేర్కొన్నారు.