News April 4, 2025
నేడు భద్రాచలంలో మంత్రి తుమ్మల పర్యటన

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం భద్రాచలంలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటలకు గోదావరి కరకట్ట పరిశీలన, 10:30 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్ల పనులు పరిశీలించనున్నారు. 11:30 గంటలకు ఆర్డీఓ కార్యాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 5, 2025
కాసేపట్లో వర్షం..

తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కాసేపట్లో వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. అటు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమకు వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చాలా చోట్ల మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది.
News November 5, 2025
జేఎన్టీయూ-ఏ ఫార్మాడీ ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్టీయూ పరిధిలో సెప్టెంబర్లో నిర్వహించిన ఫార్మాడీ 3వ సంవత్సరం రెగ్యులర్, సప్లిమెంటరీ (ఆర్17), ప్రీ-పీహెచ్డీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివకుమార్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఫలితాల కోసం jntuaresults.ac.in వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు సూచించారు.
News November 5, 2025
10ఏళ్లలో 10 మంది కబడ్డీ ప్లేయర్ల హత్య

పంజాబ్లో కబడ్డీ ప్లేయర్ గుర్వీందర్ సింగ్ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపింది. శత్రువులందరికీ ఇదే తమ హెచ్చరిక అని SMలో పోస్టు చేసింది. ‘మీ దారులు మార్చుకోండి లేదా గుండెలో బుల్లెట్ దించుకోవడానికి రెడీగా ఉండండి’ అని పేర్కొంది. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు 2016 నుంచి డ్రగ్స్, గ్యాంగ్స్టర్స్, క్రైమ్తో సంబంధమున్న 10 మంది కబడ్డీ ప్లేయర్లు హత్యకు గురికావడం గమనార్హం.


