News December 29, 2025
నేడు భద్రాచలం ఐటీడీఏలో గిరిజన దర్బార్

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం ఉదయం 10:30 గంటలకు గిరిజన దర్బార్ నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు. గిరిజనులు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలతో హాజరుకావాలని కోరారు. దర్బార్‌కు అన్ని శాఖల యూనిట్ అధికారులు సకాలంలో హాజరై ఫిర్యాదులను స్వీకరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
Similar News
News December 30, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 30, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:28 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.45 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:19 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:16 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5:52 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:09 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 30, 2025
సంగారెడ్డి: ప్రియుడితో కలిసి భర్తను చంపింది.. జైలు శిక్ష

హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా జడ్జి భవాని చంద్ర తీర్పు ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లికి చెందిన సుశీల వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడు కుమార్‌తో కలిసి భర్త నరసింహులను 2015 సెప్టెంబర్ 15న మెడకు తాడును గట్టిగా బిగించి హత్య చేశారు. కేసులో ఏ-1గా ఉన్న సుశీలకు ఇప్పటికే జీవిత ఖైదు పడింది. మరో నిందితుడు కుమార్‌కు కూడా సోమవారం జీవిత ఖైదు విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.
News December 30, 2025
సంగారెడ్డి: వాటర్ ట్యాంక్‌లో బాలుడు పడి మృతి

వాటర్ ట్యాంకులో ప్రమాదవశాత్తు ఓ బాలుడు పడి మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం సర్దార్ తండాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. తండాకు చెందిన రకియా సంతోష్ దంపతుల ఐదేళ్ల బాలుడు శ్యాంసుందర్ సోమవారం సాయంత్రం బడి వదలగానే ఆడుకుంటూ పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ వైపు వెళ్లి, పైకి ఎక్కాడు. ప్రమాదవశాత్తు ట్యాంకులో పడి మృతిచెందాడు. ఈ ఘటన తండాలో విషాదం నింపింది. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.


