News April 6, 2025
నేడు భద్రాద్రికి సీఎం రేవంత్ రెడ్డి

CM రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటన ఖరారైంది. నేడు ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో సారపాకలోని గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. 10:30కు భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకుంటారు. 11:10 నుంచి 12.30 వరకు మిథిలా స్టేడియంలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. 12:35కు సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుడి నివాసంలో భోజనం చేయనున్నారు. అనంతరం ఐటీసీ గెస్ట్ హౌస్ నుంచి HYDకు తిరుగుపయనమవుతారు.
Similar News
News September 16, 2025
నెల్లూరు: డీఎస్సీలో 16 మిగులు సీట్లు

నెల్లూరు జిల్లా నుంచి డీఎస్సీ-2025లో ఎంపికైన జాబితాను తాజాగా విద్యాశాఖ వెల్లడించింది. జిల్లాలో 673 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా 657 మంది ఎంపికయ్యారు. 16 మిగులు సీట్లు ఉన్నాయి. ఎంపికైన వారికి ఈనెల 19న విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నియామకపత్రాలు అందించనున్నారు.
News September 16, 2025
విషాదం.. గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి

AP: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో డిగ్రీ విద్యార్థిని నాగమణి(18) హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోయింది. నిన్న సాయంత్రం కాలేజీ నుంచి స్నేహితులతో నడుచుకుంటూ ఇంటికి బయల్దేరింది. వారితో మాట్లాడుతుండగానే అకస్మాత్తుగా కుప్పకూలింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. మరణానికి గుండెపోటే కారణమని పేర్కొన్నారు.
News September 16, 2025
ఇంట్లో శంఖం ఉంచవచ్చా?

ఇంట్లో శంఖం ఉంచడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. శంఖాన్ని ఇంట్లో ఉంచి పూజిస్తే తీర్థయాత్రలు చేసిన పుణ్యం లభిస్తుందని అంటున్నారు. ‘శంఖం ఊదడం వల్ల పాపాలు నశిస్తాయి. వాస్తు దోషాలు తొలగి, ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. లక్ష్మీదేవి, విష్ణువులకు శంఖం ప్రియమైంది. ఇది ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కూడా ఇంట్లోనే ఉంటుంది. శంఖం ఊదడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి’ అని అంటున్నారు.