News April 6, 2025
నేడు భద్రాద్రికి సీఎం రేవంత్ రెడ్డి రాక

CM రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటన ఖరారైంది. ఆదివారం ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో సారపాకలోని గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. 10:30కు భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకుంటారు. 11:10 నుంచి 12.30 వరకు మిథిలా స్టేడియంలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. 12:35కు సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుడి నివాసంలో భోజనం చేయనున్నారు. అనంతరం ఐటీసీ గెస్ట్ హౌస్ నుంచి HYDకు తిరుగుపయనమవుతారు.
Similar News
News February 22, 2026
జగిత్యాల: అటవీశాఖ హెచ్చరిక.. చిరుత కలకలం

జగిత్యాల జిల్లా భీమారం మండలంలోని గోవిందారం, మోత్కరావుపేట, రాజలింగంపేట, ఒడ్యాడ్ గ్రామాల్లో చిరుతపులి సంచారిస్తుందనే సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి చిరుత పాదముద్రలను గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపర్లు అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. రాత్రివేళ రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లరాదని, అనుమానాస్పద ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు.
News February 22, 2026
భద్రాచలం: రేపు ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన దర్బార్

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీవో రాహుల్ ఆదివారం తెలిపారు. గిరిజనులు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందచేయాలని కోరారు. గిరిజన దర్బార్‌కు రేపు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
News February 22, 2026
తిరుపతి జిల్లా ప్రజలకు గమనిక

సోమవారం తిరుపతి కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలు స్వీకరించనన్నారు. ఇప్పటికే అర్జీలు ఇచ్చి సమస్య పరిష్కారం కాకపోయిన వారు లేదా తమ ఫిర్యాదుల స్థితి తెలుసుకోవాలనుకునే వారు 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు.


