News July 7, 2025
నేడు భద్రాద్రి జిల్లాలో తుమ్మల పర్యటన

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అశ్వాపురం మండలం బి.జి. కొత్తూరులో మర్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పరిశీలిస్తారు. 3.30 గంటలకు భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4.30 గంటలకు కొత్తగూడెం ఐడీఓసీలో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.
Similar News
News July 7, 2025
పెద్దపల్లి జిల్లాకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఈనెల 9 వరకు పెద్దపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నీటి వనరులు, లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలు అవసరమైతే తప్ప అత్యవసర ప్రయాణాలు చేయాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు.
News July 7, 2025
పెద్దపల్లి: జులై 15లోపు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

పెద్దపల్లి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యుల ఎంపిక కోసం జులై 15లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ఎఫ్ క్యాటగిరీలో ఐదుగురు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, జీ క్యాటగిరీలో స్వచ్ఛంద సంస్థలతో అనుబంధం ఉన్న ముగ్గురిని నాన్ SC, STలను సభ్యులుగా ఎంపిక చేస్తారు. సేవల ఆధారాలతో కూడిన దరఖాస్తులు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారికి సమర్పించాలని పేర్కొన్నారు.
News July 7, 2025
పాడేరు: ప్రతీ విద్యార్ధి తల్లి పేరున మొక్కలు నాటాలి

ప్రభుత్వం విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. ఈనెల 10న నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ మీట్‌ను అన్ని యాజమాన్యాల విద్యా సంస్థల్లో విజయవంతంగా నిర్వహించాలన్నారు. ప్రతీ విద్యార్థి తల్లి పేరున మొక్కలు నాటాలన్నారు. పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని చెప్పారు.