News July 10, 2025

నేడు భద్రాద్రి జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన

image

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:30కు కొత్తగూడెం క్లబ్లో AITUC జిల్లా కార్యదర్శి, సీపీఎం నాయకుడు వీరన్న తెలంగాణ జాగృతిలో చేరే కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు పాల్వంచలో మహిళా నాయకురాలు సింధు తపస్వి నివాస సందర్శన, అనంతరం పాల్వంచ పెద్దమ్మ తల్లి దర్శనం ఉంటుంది. 3 గంటలకు తల్లిని కోల్పోయిన జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావును పరామర్శిస్తారు.

Similar News

News July 10, 2025

రానా, విజయ్ దేవరకొండ సహా 29 మందిపై ఈడీ కేసు

image

బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో సినీ నటులు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, యూట్యూబర్లు శ్రీముఖి, శ్యామల, హర్షసాయి, సన్నీయాదవ్, లోకల్ బాయ్ నాని సహా 29 మందిపై ED కేసు నమోదు చేసింది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్స్‌లను ప్రమోట్ చేశారని మియాపూర్ పోలీస్ స్టేషన్లో గతంలో FIR నమోదైన సంగతి తెలిసిందే. దీని ఆధారంగా మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ చర్యలకు దిగింది.

News July 10, 2025

హనుమకొండ: సజ్జనార్ సార్.. ఆర్టీసీలో కుర్చీలే లేవా…!

image

హనుమకొండలోని ఆర్టీసీ కార్యాలయంలో కుర్చీల కొరతతో సిబ్బంది అవస్థలు పడుతున్నారు. బస్ పాస్ కౌంటర్ల దగ్గర పని చేసే సిబ్బందికి కూర్చునేందుకు సరైన కుర్చీలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇనుప రాడ్‌తో ఉన్న స్టూల్‌కు ప్లాస్టిక్ కుర్చీ జత చేయడంతో సిబ్బంది అసౌకర్యంగా కూర్చుంటున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని సిబ్బంది కోరుతున్నారు.

News July 10, 2025

ఖమ్మం: బాలిక గర్భవతి.. యువకుడిపై కేసు నమోదు

image

మైనర్ బాలికను గర్భవతి చేసిన యువకుడిపై తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. ఎస్ఐ జగదీష్ వివరాలు ప్రకారం.. బచ్చోడు తండాకు చెందిన ధరావత్ బాలు అనే యువకుడు ఓ మైనర్ బాలిక(16)ను నమ్మించి మోసం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలుపగా వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.